Begin typing your search above and press return to search.

బుడ్డోడు బెర్త్ కన్ఫాం చేసేశాడు

By:  Tupaki Desk   |   8 Jan 2016 4:20 PM GMT
బుడ్డోడు బెర్త్ కన్ఫాం చేసేశాడు
X
సంక్రాంతి రేస్ పై ఇప్పటివరకూ ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేసేశాడు బుడ్డోడు. అందరూ రిలీజ్ డేట్ తో పోస్టర్స్ ఇచ్చినా.. నాన్నకు ప్రేమతో విషయంలో మాత్రం ఇప్పటివరకూ అంతో ఇంతో డౌట్ ఉండేది. రిలీజ్ డేట్ పోస్టర్స్ వేయకపోవడంతో.. ఒకవేళ జూనియర్ వెనక్కు తగ్గుతాడనే అనుమానం ఏదో ఓ మూల నలిగేది.

నిజానికి వెనక్కుతగ్గడం ఎన్టీఆర్ కి కూడా అవసరమనే అంచనాలున్నాయి. రికార్డులు కొట్టాలంటే ఎక్కువ థియేటర్స్ అవసరం అయిన పరిస్థితిలో.. ఓ వారం లేటుగా వచ్చి, లేటెస్ట్ రికార్డులు క్రియేట్ చేస్తాడనే అంచనా ఉంది. అయితే.. వాటన్నటినీ పటాపంచలు చేసేస్తూ.. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అంటూ నాన్నకు ప్రేమతో పోస్టర్స్ వేసేశారు. దీంతో యంగ్ టైగర్ కూడా సంక్రాంతి బెర్త్ ఖాయం చేసుకున్నట్లయింది. అసలు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో మొదట ఇలాంటి పోస్టర్లను వేసింది శర్వానంద్. జనవరి 14న విడుదల అంటూ.. అందరికంటే ముందు స్లాట్ బుక్ చేసేశాడు.

ఆ తర్వాత నాగార్జున జనవరి 15 రిలీజ్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. నెక్ట్స్ నందమూరి నటసింహం బాలకృష్ణ జనవరి 14 విడుదల అంటూ ఖాయం చేశాడు. వీటన్నిటికీ సెన్సార్ కూడా పూర్తవడంతో.. విడుదల ఫిక్స్ అయిపోయింది. అయితే.. అందరి కంటే చివర్లో యంగ్ టైగర్ ఈ పోస్టర్ ని విడుదల చేశాడు. కాకపోతే.. అన్నిటి కంటే ఎక్కువ అంచనాలు ఉన్నది నాన్నకు ప్రేమతో పైనే అని చెప్పాలి. శనివారం ఉదయాన్నే సెన్సార్ కు వెళ్లేందుకు ఎన్టీఆర్ మూవీకి ఫస్ట్ కాపీ రెడీగా ఉంది.