Begin typing your search above and press return to search.

జపాన్లో 'ఎన్టీఆర్' కోలాహలం.. పొటెత్తిన అభిమానులు..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 11:30 AM GMT
జపాన్లో ఎన్టీఆర్ కోలాహలం.. పొటెత్తిన అభిమానులు..!
X
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీగా మారుతోంది. ఇండియాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు రావడంతో నిర్మాత డీవీవీ దానయ్యకు కాసులవర్షం కురిసింది. దీంతో ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది.

ఈక్రమంలోనే జపాన్లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జపాన్ రాజధాని టోక్యోలో నేడు 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో ను వేయనున్నారు. ఇందులో భాగంగా చిత్రబృందం ఇప్పటికే జపాన్ చేరుకొని అక్కడ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి దంపతులు జపాన్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

రాంచరణ్, ఎన్టీఆర్ కొన్నిచొట్ల కలిసి ప్రమోషన్స్ చేస్తుండగా మరికొన్ని చోట్ల విడివిడిగా వెళుతున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ పనులను రాజమౌళి తనదైన శైలిలో ముందుకు తీసుకెళుతున్నారు. జపాన్లో రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ యంగ్ టైగర్ కు ఉంది. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచిన పలు సినిమాలు జపాన్ భాషలో విడుదలై అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.

అతడి డ్యాన్సులకు ఫిదా అయిన జపానీయులు రిల్స్, అనుకరణ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండటంతో అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ జపాన్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడి వారి నుంచి ఎన్టీఆర్ కు ఘనస్వాగతం లభిస్తోంది.

ఎన్టీఆర్ ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లగా అక్కడి సిబ్బంది నుంచి ఆయనకు అపూర్వ స్పందన లభించింది. ఎన్టీఆర్ తో సెల్ఫీ, ఫొటోలు దిగేందుకు వారంతా ఉత్సాహం చూపించడం కన్పించింది. ఆయన ఆటోగ్రాఫ్ ను అడిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.

ఇదిలా ఉంటే నేడు ఈ మూవీ ప్రీమియర్ షోను 'ఆర్ఆర్ఆర్' బృందం అభిమానులతో తిలకించనున్నారు. ఇందులో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా అద్భుతంగా నటించారు. మరీ వీరి నటన జపాన్ వాసులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.