Begin typing your search above and press return to search.

లండన్‌ వీధుల్లో ఎన్టీఆర్‌ స్టెప్పులు కేక

By:  Tupaki Desk   |   8 Sep 2015 5:18 AM GMT
లండన్‌ వీధుల్లో ఎన్టీఆర్‌ స్టెప్పులు కేక
X
రిచ్‌ లొకేషన్‌ లో ఫ్రేమ్‌ పెట్టాలి. రిచ్‌ కాస్ట్యూమ్‌ లో హీరోని చూపెట్టాలి. అల్ట్రారిచ్‌ సబ్జెక్టుతో తెలుగోడి మైండ్‌ సెట్‌ ని మార్చి పడేయాలి. మతిచెడేలా మలుపులు, ట్విస్టులతో సంథింగ్‌ కొత్తగా, సంథింగ్‌ ఎక్స్‌ పెరిమెంటల్‌ గా చూపించాలి. అప్పుడే సినిమా చూసిన వాడికి కిక్కు.. ఇలాంటి ఆలోచనలన్నీ ఎవరికి ఉంటాయి? .. డెఫినెట్‌ గా టాలీవుడ్‌ లో ఇలా ఆలోచించే ఒకే ఒక్క అరుదైన దర్శకుడు సుకుమార్‌. అతడి మైండ్‌ సెట్‌ ఏ ఇతర దర్శకుడితో పోల్చినా సంథింగ్‌ స్పెషల్‌. లోకం మొత్తం ఒక దారిలో వెళితే నాకంటూ ఓ దారి ఉందని తన సినిమాలతోనే చెబుతుంటాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ని ట్రెండీ లుక్‌ లో చూపిస్తున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంటుని రంగరిస్తూనే తెలుగోడి మైండ్‌ సెట్‌ కి దూరంగా వెళ్లకుండానే హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సంథింగ్‌ ఏదో చేస్తున్నాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కెరీర్‌ లోనే కనిపించనంత కొత్తగా కనిపిస్తున్నాడు ఈ చిత్రంలో. ఇదిగో లండన్‌ వీధుల్లో ఆటాపాటా, షూటింగులతో జూనియర్‌ ఫుల్‌ బిజీ. అతడితో పాటే రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ లండన్‌ లోని ఎగ్జోటికా లొకేషన్ లను ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తోంది. అయితే ఎన్టీఆర్‌ తో పాటు ఈ అమ్మడు స్టెప్పులేయాలంటేనే అంత ఈజీ కాదని అర్థమై ఉంటుంది. ఎన్టీఆర్‌ స్టెప్పుల్ని మ్యాచ్‌ చేయాలంటే లండన్‌ వీధుల్లో శికారు చేసినంత ఈజీ కానేకాదు మరి.

కాస్ట్‌ లీ బిల్డింగ్స్‌, సన్‌ సెట్‌ లైటింగ్‌, అపుడప్పుడే సూర్యాస్తమయం అవుతున్న వేళ సుదూర తీరంలోని బిల్డింగుల్లోంచి విద్యుద్ధీపాల కాంతి తేజోమయం అవుతోంది. అలాంటి అందమైన రిచ్‌ లొకేషన్‌ లో బాద్‌ షా స్టెప్పులేస్తుంటే ఆ కిక్కే వేరు గురూ? ఎంతైనా సుకుమార్‌ కదా! ప్లానింగ్‌ ఈ రేంజులోనే ఉంటుంది.