Begin typing your search above and press return to search.

'ఇజం' చూశాకే తారక్ డిసైడవుతాడా?

By:  Tupaki Desk   |   16 Sep 2016 1:30 AM GMT
ఇజం చూశాకే తారక్ డిసైడవుతాడా?
X
అసలు ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా ఏంటీ అంటే.. ఏకంగా మూడు ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి. పూరి జగన్ తో హ్యాట్రిక్ సినిమా. తమిళ డైరక్టర్ లింగుస్వామి చెప్పిన కొత్త కథ. అలాగే అనిల్ రావిపూడి తయారు చేసిన బ్లయిండ్ పర్సన్ స్టోరీ. వీటిలో ఏది చేస్తాడో చేయడో తెలియదు కాని.. డ్యాషింగ్ డైరక్టర్ పూరి సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఓ లెక్కుంది అని తెలుస్తోంది. పదండి చూద్దాం.

నిజానికి డ్యాషింగ్ కంటెంట్ తో సినిమా చేయాలంటే అందుకు పూరి జగన్ ఒక్కడే రైటు. పైగా సినిమాను చెప్పిన టైములో తీసి చేతిలో పెట్టేస్తాడు. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం ''ఇజం'' సినిమా రిజల్టును చూసిన తరువాత అసలు పూరితో సినిమా చేయాలా వద్దా అనే విషయం ఫిక్సవుతానని చెబుతున్నాడట. ఇప్పటికే ఆ సినిమాను ఎడిటింగ్ రూములో చూసేశాడు కాని.. ఇప్పుడు పైనల్ గా ప్రేక్షకులు ఎలాంటి రిజల్టును ఇస్తారో మాత్రం తెలియదు. కళ్యాణ్‌ రామ్ సినిమా ట్రైలర్ అదిరిపోయినా.. పూరి ప్రతీ సినిమా విషయంలోనూ ట్రైలర్లు అదిరిపోతుంటాయిలే. అందుకే సినిమా రిజల్టు చూశాకే ఈ ప్రాజెక్టు మీద ఫిక్సవుదాం అని తేల్చేశాడట తారక్.

ఇకపోతే మొన్నటివరకు దసరాకు వస్తుందని అనుకున్న 'ఇజం' సినిమా ఇప్పుడు మాత్రం ఏకంగా మిడ్ అక్టోబర్ లేదా నవంబర్ స్టార్టింగ్ అంటున్నారు. ఆ సినిమా రిలీజైతేనే మరి పూరి-ఎన్టీఆర్ సినిమాపై ఒక క్లారిటీ వస్తుందేమో.