Begin typing your search above and press return to search.

ఫిక్ టాక్ : కొడుకులతో ఎన్టీఆర్ దీపావళి సందడి

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:32 AM GMT
ఫిక్ టాక్ : కొడుకులతో ఎన్టీఆర్ దీపావళి సందడి
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ దీపావళి సందర్బంగా తన కొడుకులు అభయ్‌ రామ్ మరియు భార్గవ్ రామ్ తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభయ్‌ రామ్‌ అప్పుడే తండ్రి ఎన్టీఆర్‌ బుజాల వద్దకు ఎత్తు పెరిగాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే భార్గవ్ రామ్‌ ఎంత క్యూట్ గా ఉన్నాడో అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ దీపావళికి ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి కాని అభయ్‌ రామ్‌ మరియు భార్గవ్‌ రామ్‌ ముందు ఆ దీపాలు అన్ని కూడా చిన్న బోయినట్లుగా అనిపిస్తున్నాయి అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ తన ఇద్దరు కొడుకులతో దిగి షేర్‌ చేసిన ఫొటో ఈ ఏడాది దీపావళికి వచ్చిన టాలీవుడ్‌ ఫొటోస్‌ ల్లో బెస్ట్‌ జాబితాలో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలు.. షూటింగ్ లు.. షో లు.. ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎన్టీఆర్‌ తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఎక్కువ ఆసక్తిని కనబర్చుతూ ఉంటాడు. తన పిల్లలకు లాక్ డౌన్‌ సమయంలో తెలుగు నేర్పించినట్లుగా చెప్పిన ఎన్టీఆర్‌ పిల్లల పెంపకం విషయంలో తన తాత గారి క్రమ శిక్షణ పాటిస్తున్నట్లుగా చెబుతూ ఉంటాడు. అభయ్‌ రామ్‌ మరియు భార్గవ్‌ రామ్ లకు ఎంత స్వేచ్చ ఇవ్వాలో అంత స్వేచ్చ ఇస్తూనే క్రమ శిక్షణగా పెంచే విషయంలో ఎన్టీఆర్‌ ను చూసి అంతా నేర్చుకోవాలంటూ ఉంటారు. మొత్తంగా దీపావళి సందర్బంగా అభిమానుల ముందుకు ఈ ఫొటోను తీసుకు వచ్చినందుకు ఎన్టీఆర్‌ కు మీడియా వర్గాల వారు మరియు అభిమానులు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదలకు సిద్దం అవుతోంది. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా లో చరణ్ తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్‌. ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదలకు ముందుగానే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గాను ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడు. అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌.. కొరటాల శివ కాంబో సినిమాకు ఆలియా భట్‌ ను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా పెళ్లి సందడి కొత్త హీరోయిన్‌ శ్రీలీలను కూడా సినిమాకు సంప్రదించారనే ప్రచారం జరిగింది. హీరోయిన్‌ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.