Begin typing your search above and press return to search.

మాంత్రికుడు సరే.. రాజమౌళి ఏమిస్తాడో?

By:  Tupaki Desk   |   16 May 2018 10:36 AM GMT
మాంత్రికుడు సరే.. రాజమౌళి ఏమిస్తాడో?
X
మరో నాలుగు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే రాబోతోంది. ఇప్పటికే మే 20వ తేదీ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. తమ హీరో పుట్టిన రోజును వేడుకలా జరిపేందుకు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ కూడా తన ఫ్యాన్స్ ను అలరించేందుకు కొత్త అప్ డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇఫ్పటికే తనతో సినిమా తీసేందుకు అంగీకరించిన మేకర్స్ కు కొన్ని సూచనలు కూడా చేసేసినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది 35వ పుట్టిన రోజు చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ హీరోగా రూపొందుతోన్న 28వ చిత్రం సెట్స్ పై ఉంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు మాటల మాంత్రికుడు రెడీ అయిపోతున్నాడు. ఎన్టీఆర్28కి ఫస్ట్ లుక్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త సినిమా ఫస్ట్ లుక్ వస్తోందంటే.. కచ్చితంగా అభిమానులను సంతోషపరిచే విషయమే.

అయితే.. ఈ సారి బర్త్ డేకి డబుల్ డోస్ ఇచ్చేందుకు యంగ్ టైగర్ రెడీ అవుతున్నాడట. రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో #RRR అంటూ ఓ ప్రాజెక్టు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పై ఓ స్పెషల్ అంశాన్ని విడుదల చేయబోతున్నారట. త్రివిక్రమ్ సినిమా అంటే సెట్స్ పై ఉంది కాబట్టి.. ఏదో ఒక మెటీరియల్ ఇవ్వచ్చు. మరి రాజమౌళి మూవీ ఇంకా ప్రీప్రొడక్షన్ దశలోనే ఉంది. ఇప్పటికి అనౌన్స్ మెంట్ మాత్రమే వచ్చింది. అలాంటప్పుడు రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ గురించి ఏం చెబ్తారబ్బా?