Begin typing your search above and press return to search.
బర్త్ డే నాడు తారక్ ఎమోషనల్ ట్వీట్...!
By: Tupaki Desk | 20 May 2020 12:22 PM GMTనేడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానుల్లో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. కాకపోతే దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని.. అభిమానులను వేడుకలకు దూరంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను షేర్ చేసి.. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులతో పంచుకున్నారు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ అభిమానులు యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ట్విట్టర్ వేదికగా #HappyBirthdayNTR, #HappyBirthdayTarak అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దాదాపు 20 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్స్ చేస్తూ మోత మోగించారు. ఇది ఇండియాలోనే ఏ సినీ హీరో కూడా సంపాదించలేని రికార్డు అని వారు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా తనపై నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూ బర్త్ డే విషెస్ తెలిపిన వారందరికీ ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి గురయ్యారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తన అభిమానులకు సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు.. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని... మీరందరూ ఈరోజును మరింత స్పెషల్ గా మార్చారని చెప్పారు. 'మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప' అని ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనికి తారక్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ కామెంట్స్ పెడుతూ తమ హీరో పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.