Begin typing your search above and press return to search.

సిస్టర్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్‌ కూడా..

By:  Tupaki Desk   |   19 Nov 2015 4:02 AM GMT
సిస్టర్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్‌ కూడా..
X
తమిళంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న అజిత్ వేదాలంపై టాలీవుడ్ కన్ను పడింది. రొటీన్ కంటెంటే అని క్రిటిక్స్ అన్నా.. డైరెక్టర్ శివ పిక్చరైజ్ చేసిన తీరు సూపర్బ్ గా ఉండడంతో తమిళులు వేదాలంను సూపర్ హిట్ చేసేశారు. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే 45 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని కోలీవుడ్ పండితులు చెబుతున్నారు.

ఇక ఈ మూవీ చూడాలంటూ.. ఏ ఎం రత్నం నుంచి మెగాస్టార్ కి కబురు కూడా వచ్చింది. ఆ సంగతి తెలిసిందే. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అయితే.. ఇప్పటికే స్పెషల్ షో వేయించుకుని మరీ చూసేశాడట. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ ని డైరెక్టర్ శివ పండించిన తీరు చూసి.. యంగ్ టైగర్ మెస్మరైజ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. రొటీన్ స్టోరీనే అయినా, దర్శకుడి ప్రతిభను పలు మార్లు మెచ్చుకున్నట్లు టాక్‌. అయితే.. రీమేక్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎన్టీఆర్. ఇంకోవైపు హీరోయిన్ కేరక్టర్ కూడా ముఖ్యమైనదే. లాయర్ పాత్రను తమిళ్ లో శృతిహాసన్ పోషించింది.

తెలుగు నేటివిటీకి తగ్గ కథ కావడం, డైరెక్టర్ శివకు తెలుగులో సినిమాలు తీసిన అనుభవం ఉండడంతో.. తెలుగులోకి మనోడి డైరక్షన్‌ లోనే వేదాలం రీమేక్ అయ్యే ఛాన్సులే కనిపిస్తున్నాయి. బట్.. హీరో ఎవరో ఫిక్స్ అవాలంతే.