Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు కూడా ‘మెగా’ తలనొప్పి తప్పదేమో
By: Tupaki Desk | 27 Dec 2015 9:30 AM GMTమెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమాకు సంబంధించిన ఫంక్షన్ జరిగినా ‘పవర్ స్టార్’ నినాదాలు తప్పవు. ఇంతకుముందు ఏదో సరదాకి అరిచేవారు కానీ.. నాగబాబు మందలించాక అరుపులు మరీ శ్రుతి మించుతున్నాయి. ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పుడిక నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లకు కూడా ఈ తరహా తలనొప్పి తప్పేలా లేదు.
ఎన్టీఆర్ కు - బాలయ్యకు కొన్నేళ్లుగా అభిప్రాయ భేదాలున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అవి మరింత ముదిరాయి. ఈ మధ్య ఎన్టీఆర్ బాలయ్యకు సారీ చెప్పేశాడని.. బాలయ్య కరిగిపోయాడని.. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ కు కూడా ముఖ్య అతిథిగా వస్తాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవమున్నట్లుగా లేదు. బాలయ్య ఈ వేడుకకు రావట్లేదు. ఈ నేపథ్యంలో బాబాయి- అబ్బాయి మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నట్లే భావించాలి.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ లో నందమూరి అభిమానులు ఎలా రెస్పాండ్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫంక్షన్ కు బాలయ్యను మాత్రమే అభిమానించే నందమూరి అభిమానులు రావచ్చని.. ‘జై బాలయ్య’ నినాదాలతో హోరెత్తించవచ్చని అంచనా వేస్తున్నారు. మొన్న ‘డిక్టేటర్’ ఆడియో ఫంక్షన్ లో.. నందమూరి అభిమానులకు ఏ సంబంధం లేని ‘సౌఖ్యం’ వేడుకలో జై బాలయ్య నినాదాలు హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’ వేడుకలోనూ ఈ నినాదాలు చేస్తూ బాలయ్య గురించి స్పందించి తీరాలని అభిమానులు గొడవ చేసే పరిస్థితి వస్తే.. ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.