Begin typing your search above and press return to search.
మెగా హీరోకి ఎన్టీఆర్ ఫ్యాన్ ఫిదా
By: Tupaki Desk | 6 March 2018 4:50 AM GMTసినీ ప్రపంచంలో చాలా వరకు హీరోలు ఎంత సింపుల్ గా ఉంటె అభిమానులు అంత ఇష్టపడతారు. హీరో చిన్న నవ్వుతో ఒక్కసారి చేయి కలిపితే చాలు అభిమానులు ఎంతో ఆనందపడిపోతారు. అభిమానాన్ని తట్టుకోవడం ఈ రోజుల్లో స్టార్ హీరోలకు చాలా కష్టం. హీరో కనిపిస్తే వారు పడే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ ఒక్కోసారి అభిమానం పల్స్ లెవెల్స్ టార్గెట్ దాటితే.. హీరోలకు చాలా కోపం వస్తుంది. కొంత మంది హీరోలైతే కొడతారు.
సెల్ఫీ అడిగితే మొబైల్ లాక్కొని విసిరేసి జనాలున్నారు. కోపం అందరికి ఉంటుంది. కానీ అభిమానులను అర్ధం చేసుకునే గుణం కొంత మందికే ఉంటుంది. ఆ లిస్ట్ లో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. ఎందుకంటే ఎంతో బిజీగా అలసిపోయి ఉన్న చరణ్ ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గానే నవ్వుతూ ఒకే చెప్పేశాడు. అయితే ఆ వ్యక్తి రామ్ చరణ్ అభిమాని కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య ఇద్దరి హీరోల అభిమానులు కూడా చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారు. ఇద్దరి హీరోలని సమానంగా అభిమానిస్తున్నారు.
అదే తరహాలో ఎన్టీఆర్ ఫ్యాన్ హైదరాబాద్ విమానాశ్రమంలో చరణ్ ని చూసి సెల్ఫీ అడిగాడు. పక్కన ఉపాసన - లగేజ్ ఉన్నా ఏ మాత్రం ఆలోచించలేదట. పైగా నైట్ మొత్తం ట్రావెల్ చేసి కొంచెం అలసిపోయి ఉన్నా కూడా చరణ్ తన వ్యక్తిగతం గురించి ఆలోచించకుండా ప్రేమతో వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్ ని ఖుషి చేశాడట. ఈ విషయాన్ని ఆ అభిమాని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మొత్తానికి చరణ్ భలే సింపుల్ అండ్ కూల్ మనిషి అంటూ అందరూ పొగుడుతున్నారు.