Begin typing your search above and press return to search.
అరవింద సమేత .. పెనిమిటిని మరువలేదే
By: Tupaki Desk | 11 Oct 2019 8:27 AM GMTకత్తి పట్టి..చొక్కా విప్పి.. రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో అభినయించగల వీర రాఘవరెడ్డి..
కూర్చున్న చోట నుండి కదలకుండా..గొంతెత్తితేనే పగోడికి ముచ్చెమటలు పట్టించగల రాఘవుడు..
తన స్థాయికి తగ్గ కథ రాసుకునే దమ్ముండాలేకాని..తన వల్ల కానిది ఏదీ లేదు...!!
ఇదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానుల ప్రేమాభిమానం. నేటితో `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం రిలీజై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తారక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆ సినిమా పోస్టర్లను షేర్ చేస్తూ.. పంచ్ డైలాగులతో తారక్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తారక్ కెరీర్ లోనే క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి క్లాసిక్ టచ్ ఉన్న మాటల్ని రాయడం.. అవి తారక్ నోట అద్భుతంగా వర్కవుటవ్వడంతో ప్రతిదీ ఫ్యాన్స్ మైండ్ లో అలా స్థిరంగా నాటుకుపోయాయి. అరవింద సమేత తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టచ్ లోకొచ్చారు. ఇందులో ఎన్టీఆర్ కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది అభిమానుల్లో వైరల్ గా మారుతోంది.
అరవింద సమేత తారక్ కెరీర్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ కాకపోయినా.. ఓ క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కథను పరిశీలిస్తే.. రాయలసీమ లో నల్లగుడి.. కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథతో తెరకెక్కింది. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు..కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు).. ఆ ఇద్దరి మధ్యా కొట్లాట. పేకాటలో ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయ్యాయి. నారపరెడ్డి బిడ్డ విదేశాల్లో చదువు ముగించుకుని ఊరికి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని.. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలనుకక్షలను చల్లార్చేందుకు వీర రాఘవ చేసిన ప్రయత్నం ఎలాంటిది? అన్నదే సినిమా. క్లాసిక్ స్టోరీని ఎంచుకుని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించారు.
``చిమ్మాటి చీకటి కమ్మటి సంగటి.. ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి.. కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి....గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి..`` అన్న పాట ఎంత పాపులరైందో తెలిసిందే. `అరవింద సమేత` సినిమాతో తమన్ కెరీర్ మరో టర్న్ తీసుకుంది.
తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.