Begin typing your search above and press return to search.

35 రోజులు.. 35 పోస్ట‌ర్లు..

By:  Tupaki Desk   |   12 April 2018 5:18 AM GMT
35 రోజులు.. 35 పోస్ట‌ర్లు..
X
యంగ్ టైగ‌ర్ ఎన్‌.టీ.ఆర్ కి మాస్ లో ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న‌ కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే వీరాభిమానులు తార‌క్ కి మాత్ర‌మే సొంతం. జూనియ‌ర్ కూడా అభిమానులంటే ప్రాణ‌మిస్తాడు. వాళ్ల కార‌ణంగానే తాను ఈ పొజిష‌న్ లో ఉన్నాన‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించుకుంటాడు. త‌న ప్ర‌సంగంలో ఎప్పుడూ...‘అభిమాన దేవుళ్లు’ అంటూ సంభోదిస్తూ ఉంటాడు. అందుకే త‌మను అమితంగా అభిమానించే అభిమాన హీరో పుట్టిన‌రోజు కోసం వినూత్నంగా ఆలోచించారు యంగ్ టైగ‌ర్ అభిమానులు.

నంద‌మూరి వార‌సుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ రామారావు అన‌తికాలంలోనే న‌టుడిగా త‌న‌ని తాను నిరూపించుకుని... స్టార్ హీరోగా ఎదిగాడు. 1983 మే 20న జ‌న్మించిన తార‌క్... ఈ ఏడాదితో 35వ ఒడిలో అడుగుపెట్ట‌బోతున్నాడు. దీంతో ఆయ‌న అభిమానులు ప్రేమ‌తో ఆయ‌న మీద 35 పేజీల పుస్త‌కాన్ని రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. 35 రోజుల పాటు రోజుకో పోస్ట‌ర్ చొప్పున 35 పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. తొలి పోస్ట‌ర్ గా తార‌క్ బాల‌న‌టుడిగా..న‌టించిన మొద‌టి సినిమా ‘బాల రామ‌య‌ణం’ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ‘రామునిగా తార‌క రాముడు’ అని దీనికి టైటిల్ పెట్టారు. తార‌క్ తాత గారి ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టగా సినిమాల్లో న‌టించార‌ని- ఆ త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘బాల‌రామ‌య‌ణం’ చేశార‌ని ఇంగ్లీషులో రాశారు.

ఈ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్త‌మ పిల్ల‌ల చిత్రం అవార్డు వ‌చ్చింద‌ని కూడా ఈ పోస్ట‌ర్‌ లో ఉంది. తాత పోలిక‌ల‌తో ఆయ‌న‌కు త‌గ్గ వార‌సుడిగా ఎదిగాడ‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ... జై ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్‌ తో ఫినిష్ చేశాడు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఎన్‌టీఆర్ చేసింది 27 సినిమాలే... వాటిల్లో ద్విపాత్రాభినయం- త్రిపాత్రాభిన‌యం చేసిన పాత్ర‌ల‌ను కూడా పోస్ట‌ర్లుగా వ‌దులుతారేమో చూడాలి.