Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ను అలా చూడలేకపోయిన ఫ్యాన్స్
By: Tupaki Desk | 31 Aug 2018 10:25 AM GMTసౌత్ లో స్టార్ హీరోలకు అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారన్న విషయం తెలిసిందే. మిగతా హీరోల ఫ్యాన్స్ కు భిన్నంగా మన స్టార్ హీరోల అభిమానులు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి అభిమాన నటుడి మీద ప్రేమాభిమానాలు అదే స్థాయిలో చూపిస్తారు. ఇక తెలుగులో ఉన్న టాప్ లీగ్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. అయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందువరసలో ఉంటారు.
ఎప్పుడైతే నందమూరి హరికృష్ణ యాక్సిడెంట్ న్యూస్ బయటకు వచ్చిందో అప్పటినుంచి వాళ్లు డల్ అయ్యారు. తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉందోనని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇక నిన్న అంతిమ యాత్ర సమయంలో ఎన్టీఆర్ తన గుండెలోని బాధ కన్నీరు రూపంలో ఉబికి వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులందరూ తమ సొంత మనిషికే ఆ కష్టం వచ్చింది అన్నట్టుగా తల్లడిల్లిపోయారు. ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే కళ్యాణ్ రామ్ కూడా కంటతడి పెట్టడం చాలామందిని కదిలించింది. ఎన్టీఆర్ ఫోటోను అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కొంతమంది వ్యాఖ్యానించారు.
చాలామంది ఫ్యాన్స్ నందమూరి హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని - ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఈ కష్ట సమయంలో ధైర్యాన్నివ్వాలని సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారు. నందమూరి కుటుంబ సభ్యులకు తోడుగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.