Begin typing your search above and press return to search.

యువ హీరో మాటలకు.. తారక్ ఫ్యాన్స్ ఫిదా

By:  Tupaki Desk   |   18 May 2023 2:00 PM GMT
యువ హీరో మాటలకు.. తారక్ ఫ్యాన్స్ ఫిదా
X
ఇప్పటి వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ రీ రిలీజ్ సినిమాలకు ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేయలేదు. కానీ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకు మాత్రం ఆ ఫంక్షన్ చేశారు. సింహాద్రి విడుదలై 20ఏళ్లు కాగా, ఆ సిసిమాని మే 20వ తేదీన 1000 స్క్రీన్లపై ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి యువ హీరో విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను మాటల్లో కురిపించారు.

దేశమంతా సింహాద్రి సినిమా రీ రిలీజ్ గురించి చర్చించుకుంటుందని విశ్వక్ సేన్ అన్నారు. ఇది కచ్చితంగా నేషనల్ న్యూస్ అవుతుందని ఆయన అన్నారు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు. ఇంత వరకు ఏ అభిమానికి దక్కని అవకాశం తనకు దక్కిందని ఆయన అన్నారు.

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక అనంతరం అక్కడ వారు ఆయనను రెండు రోజులు ఉండమని అడిగినా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చారని విశ్వక్ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ అభిమానులకు చాలా విలువ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఆ రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పాడు.

ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. విశ్వక్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.విశ్వక్ చాలా లక్కీ అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ తో పాటు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు.

రిలీజ్ అయిన సినిమాకు మళ్లీ రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం ఇదే తొలిసారి అని గోపిచంద్ మలినేని పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు చేసినా రోమాలు నిక్కపొడుచుకుంటాయని ఆయన చెప్పారు. ఇక తాను కూడా ఎన్టీఆర్ కి అభిమాని అంటూ డైరెక్టర్ హను రాఘవపూడి చెప్పడం విశేషం.

ఎన్టీఆర్ పుట్టినరోజు మే20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజున ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించన అప్ డేట్స్ కూడా రానున్నాయి.