Begin typing your search above and press return to search.

చాలు బాబాయ్ చాలు అంటున్నారు!

By:  Tupaki Desk   |   2 Sep 2018 9:31 AM GMT
చాలు బాబాయ్ చాలు అంటున్నారు!
X
బాబాయ్ - అబ్బాయ్ రిలేషన్ ఎప్పుడూ స్పెషలే. ఎవరింట్లో అయినా అబ్బాయిలు తమ తండ్రితో కంటే బాబాయి తో చనువుగా ఉండడం సహజంగా జరిగేదే. మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి బాబాయ్ అబ్బాయ్ లు చాలామందే ఉన్నారు. కానీ ఒక పాపులర్ బాబాయి- అబ్బాయిల జోడీ అందరికంటే భిన్నం. మొదట్లో దూరం దూరం. తర్వాత దగ్గర దగ్గర. ఆ తర్వాత పచ్చగడ్డి వేస్తె భగ్గు భగ్గు. ఇప్పుడు మళ్ళీ కాస్త సంబంధం మెరుగుపడినట్టు సంకేతాలు వచ్చాయి.

ఈ పరిణామం ఆ కుటుంబ అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తోంది.. బాబాయ్ - అబ్బాయిల కలయిక సూపర్ అని ఇప్పుడే దసరా.. సంక్రాంతి చేసుకుంటున్నారు. కానీ ఈ హంగామా అబ్బాయ్ వీరాభిమానులకు సుతారమూ నచ్చడం లేదట. బాబాయ్ కి నచ్చినప్పుడు పక్కన కూర్చుబెట్టుకుంటాడు.. కోపం వస్తే నిర్దాక్షిణ్యంగా తొక్కేయాలని చూస్తాడు.. అలాంటి బాబాయి తో తమ హీరో జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. రిలేషన్ వరకూ ఒకే.. తమ హీరోకు ఆయన బాబాయి కాబట్టి తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి అంతే కానీ మళ్ళీ నమ్మి తమ హీరో నష్టపోకూడదని కోరుతున్నారు.

మరి తమ వీరాభిమానుల ఆలోచనను ఆ హీరో గ్రహించి నడుచుకుంటాడో లేదో కాలమే నిర్ణయించాలి. ఎన్ని చెప్పినా బ్లడ్ రిలేషన్ కదా.. తప్పొప్పులు ఎవరు చెప్పగలరు. బ్లడ్ ఈజ్ తిక్కర్(థిక్కర్ కాదు) దేన్ పేటెంటెడ్ బాటిల్ వాటర్. అర్థం కాలేదా? వాళ్ళ రిలేషన్ లో ఉన్న కన్ఫ్యూషన్ కంటే ఈ కొటేషన్ లో ఉన్న కన్ఫ్యూషన్ పెద్దది కాదు కదా?