Begin typing your search above and press return to search.
వినాయకుడిని జూనియర్ అభిమానులు ఇలా చేశారు!
By: Tupaki Desk | 6 Sept 2016 9:34 AM ISTభారతదేశంలో క్రికెటర్లకు, సినిమా వాళ్లకు ఉండే అభిమానులు, వారి అభిమాన చేసే పనులు అన్నీ ఇన్నీ కాదు. తమ అభిమాన నటుడి పోస్టర్లకు దండలు వేయాలన్నా, కటౌట్లకు పాలభిషేకాలు చేయలన్నా వారే చేయాలి. తమ అభిమాన నటికి గుడికి కూడా కట్టగలరు, విగ్రహాలు పెట్టి పూజించనూ గలరు. ఇదే క్రమంలో వినాయక చవితి సందర్భంగా యంగ్ టైగర్ అభిమానులు తమ హీరోపై అభిమానాన్ని చూపిస్తూనే వినాయక చవితిని సెలబ్రేషన్స్ చేశారు.
ఈ సంవత్సరం తాజాగా విడుదలయిన ఎన్టీఆర్ సినిమా "జనతా గ్యారేజ్" - ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును! అనే ట్యాగ్ లైన్‌తో కొరటాల దర్శకత్వంలో వచ్చింది. అయితే జనతా గ్యారేజ్ ను ఎన్టీఆర్ అభిమానులు "వినాయక గ్యారేజ్"గా మార్చేశారు. అంతేనా... ట్యాగ్ లైన్ కూడా "ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును" అని పెట్టి అదరగొట్టేసారు. వీరు వినయకుడీ భక్తులా, ఎన్టీఆర్ భక్తులా అనే విషం కాసేపు పక్కనపెడితే... వినాయకుడిపై భక్తినీ - ఎన్టీఆర్ పై అభిమానాన్ని ఒకేసారి చూపించుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ విగ్రహం సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తుంది.
జనతాగ్యారేజ్ సినిమా పోస్టర్స్ లో ఎన్టీఆర్ గళ్ల చొక్కా, కాకీ రంగు ఫ్యాంట్ ధరించినట్లే.. అచ్చూ అలాంటి దుస్తులనే వినాయకుడి ప్రతిమకు కూడా వేయించుకున్నారు అభిమానులు! కాగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ సినిమా విడుదలయ సమయంలో గబ్బర్ సింగ్ గెటప్ లోనూ, ఆ తర్వాత ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సినిమా విడుదల అనంతరం బాహుబలి గెటప్ లోనూ గణనాథుడు దర్శనమిచ్చాడు!j