Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు పాలిటిక్స్ కలసిరావే

By:  Tupaki Desk   |   25 July 2017 4:18 AM GMT
ఎన్టీఆర్ కు పాలిటిక్స్ కలసిరావే
X
ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల చూపంతా కూడా ''జై లవ కుశ'' సినిమాపైనే ఉంది. ఈ సినిమాలో ఈల్రెడీ రావణాసురిడి జీన్స్ ను బేస్ చేసుకుని మలచిన జై క్యారక్టర్ తాలూకు టీజర్ కూడా బాగా ఇంప్రెస్ చేయడంతో.. ఇప్పుడు మిగతా రోల్స్ అన్నీ కూడా ఎలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఇక్కడే ఒక విషయం వారిని కాస్త ఇబ్బందిపెడుతోంది.

అసలు నిన్న వర్కింగ్ స్టిల్స్ కొన్ని లీక్ అవ్వడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ 'సమ సమాజ్ పార్టీ' అనే పార్టీకోసం పనిచేసే నాయకుడిగా కనిపించనున్నాడని అర్ధమైపోయింది. కాని మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ కు ఈ పొలిటికల్ టచ్ ఉన్న రోల్స్ అయినా.. లేదంటే ఏదన్నా సినిమాలో పొలిటికల్ పంచులు పేల్చినా కూడా అవన్నీ వర్కవుట్ కాలేదు. పూర్తి స్థాయి పాలిటిక్స్ తో వచ్చిన 'నాగ'.. కాస్త కాస్త పొలిటికల్ పంచులు పేల్చిన 'దమ్ము' 'రామయ్యావస్తావయ్యా' వంటి సినిమాలన్నీ దారుణమైన ఫ్లాపులే. అసలు ఎన్టీఆర్ పాలిటిక్స్ టచ్ చేస్తే చాలు.. ఆ సినిమా పేలిపోయింది. ఈ సైకిల్ మీద వచ్చి చాలామంది చరిత్ర సృష్టించారు అంటూ డైలాగ్ చెప్పినా 'కంత్రి' సినిమా ఆడలేదు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ పాలిటిక్స్ ను టచ్ చేస్తున్నాడంటే చాలా అభిమానులు భయపడుతున్నారు. అందుకే అతనికి పాలిటిక్స్ కలసిరావు అని చెబుతున్నారు.

అయితే పైన చెప్పిన సినిమాలన్నీ కేవలం పాలిటిక్స్ ను టచ్ చేసినందుకు ఫెయిల్ అయిపోయాయ్ అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే. ఆ సినిమాల్లో ఈ పొలిటికల్ డైలాగులు కాకుండా మిగిలిన కంటెంట్లో పెద్దగా మ్యాటర్ లేదు. అందుకే అవన్నీ ఫ్లాపులు అయ్యాయ్. కాబట్టి 'జై లవ కుశ' వచ్చేవరకు అసలు ఈ పొలిటికల్ సెంటిమెంట్ డైలాగులు ఎంతవరకు నెగెటివ్ ప్రభావం చూపిస్తాయ్ చూపించవు అనేదే మనం చెప్పలేం.