Begin typing your search above and press return to search.
తారక్ ఫ్యాన్స్ పిచ్చి పీక్స్
By: Tupaki Desk | 3 Oct 2018 5:30 AM GMTఓవైపు ఎమోషన్.. కన్నీళ్లు.. ఆవేదనలు.. మరోవైపు ఫ్యాన్స్ గోల గగ్గోలు!! మంగళవారం రాత్రి నోవాటెల్ లో `అరవింద సమేత` ప్రీరిలీజ్ ఈవెంట్ లో దృశ్యమిది. నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ రాకతో చుట్టూ మూగేసిన ఫ్యాన్స్.. అక్కడితో ఆగారా? అంటే అదేం లేదు. వీళ్లు ఎమోషనల్ గా మాట్లాడుతున్నంత సేపూ అరుస్తూ రచ్చ చేశారు. హరికృష్ణ అమర్ రహే! అన్న పోస్టర్లతో స్లోగన్స్ వినిపించారు. అదంతా బాగానే ఉంది కానీ..
ఈవెంట్ ఎండింగ్ లోనే ఎన్టీఆర్ వెంట పడిన తీరు మాత్రం జుగుప్స కలిగించక మానదు. ఫ్యాన్స్ పిచ్చి పీక్స్! అన్న చందంగా ఓవైపు ఎన్టీఆర్ కన్నీటి పర్యంతమై - ఈవెంట్ ముగించేసి వెళుతుంటే ఫ్యాన్స్ ఒక్కసారిగా మూకుమ్మడిగా మీద పడ్డారు. ఆ క్రమంలోనే దాదాపు 5-10 మంది బౌన్సర్లు ఫ్యాన్స్ ని కాలర్లు పట్టుకుని వెనక్కి లాగాల్సొచ్చింది. పలువురికి ఫెడీల్ ఫెడీల్ మని లెంపకాయలు పడిన దృశ్యం కనిపించింది. ఆ సౌండ్స్ - అరిచిపెట్టి గోల చేసే సీన్ కూడా వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయ్.
``మేం ఉన్నా.. మీకు ఫ్యామిలీ ముఖ్యం. క్షేమంగా ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండండి!`` అని తారక్ చెబుతున్నా ఎవరూ వినలేదు. సరికదా తారక్ వెళ్లిపోతుంటే వెంటపడి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు కొందరైతే. మరికొందరైతే తారక్ తారక్ అంటూ గట్టిగానే అరిచేశారు. చూసేవాళ్లకు అదో వింతైన సన్నివేశం. అభిమానం వెర్రితలలు వేయడమేనని అనిపించక మానదు. నిజానికి అక్కడ బౌన్సర్లు లేకపోతే మీద పడి నలిపేసేవారేమో! అన్న సందేహాలు కలిగాయి ఫ్యాన్స్ వీరంగం చూశాక. శవంతో సెల్ఫీలు దిగే మనుషులున్న లోకమిది! (హరికృష్ణ భౌతిక కాయంతో దిగారు కదా!) అభిమానం వెర్రితలలు వేస్తే తప్పేంటి.. అంటారా? దీనిని ఎవరైనా హర్షించగలరా? సమయం సందర్భం అఖ్కర్లేదా? కాస్తయినా ఇంగితం కూడా అవసరమే కదా.. కాదంటారా?