Begin typing your search above and press return to search.
శుభాకాంక్షలతో ట్రెండ్ సెట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎందుకంటే??
By: Tupaki Desk | 5 May 2021 10:55 AM GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ మల్టీస్టారర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. ఈ విషయంలో నందమూరి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అని అందరికి తెలిసిందే కానీ అలాంటి టాలెంట్ దేశవ్యాప్తంగా తెలియాలనేది ఫ్యాన్స్ కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకోబోతున్నాడు.
అయితే సినిమా విషయాలు పక్కనపెడితే అందరి లైఫ్ లో స్పెషల్ డేస్ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మోర్ స్పెషల్ అవుతాయి. పుట్టినరోజు కంటే విలువైనదిగా భావిస్తారు.. అదే పెళ్లిరోజు. ఈరోజు ఎన్టీఆర్ - ఆయన సతీమణి లక్ష్మిప్రణతి పెళ్లిరోజు. 2011లో మే 5న ఎన్టీఆర్ - లక్ష్మిప్రణతి మూడుముళ్లతో ఒక్కటయ్యారు. నేటితో వీరి వివాహ బాంధవ్యానికి పదేళ్లు. కేవలం ఫేవరేట్ హీరోల పుట్టినరోజులకే కాదు ఫేవరేట్ హీరోల పెళ్లిరోజులను కూడా ట్రెండ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదేపనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ - లక్ష్మిప్రణతి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వీరి పదేళ్ల బంధంలో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు. 2014లో అభయ్ రామ్ - 2018లో భార్గవ్ రామ్. ఎన్టీఆర్ సతీమణి పెద్దగా వార్తల్లో కనిపించరు. ఎప్పుడో భర్త పుట్టినరోజులకు లేదా స్పెషల్ డేస్ అప్పుడే సోషల్ మీడియాలో కనిపిస్తారు. లేదా ఎవరిదైనా సెలబ్రిటీ పెళ్లిలో ఎన్టీఆర్ తో కనిపిస్తారు. కానీ మాములుగా అసలు సోషల్ మీడియాలో ఆమె కనిపించడం అరుదు. ఈ దశాబ్దపు కాలంలో ఏ రోజు కూడా ఆమె వార్తల్లో నిలిచింది లేదు. అప్పుడప్పుడు పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. పిల్లలు అభయ్, భార్గవ్ చాలా క్యూట్ గా అల్లరి చేసే ఫోటోలు అప్లోడ్ చేస్తారు. అయితే ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీ అయినప్పటికీ ఫ్యామిలీకి టైం కేటాయించడంలో ముందుంటారు. అలాగే పండుగలకు స్పెషల్ డేస్ విషెస్ కూడా మర్చిపోకుండా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతారు ఈ స్టార్ కపుల్. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ కపుల్ మ్యారేజ్ డేను స్పెషల్ చేస్తున్నారు.