Begin typing your search above and press return to search.

గడగడమని కన్నడ.. వాళ్ళు షాక్!

By:  Tupaki Desk   |   10 Oct 2018 6:15 AM GMT
గడగడమని కన్నడ.. వాళ్ళు షాక్!
X
మన తెలుగు వాళ్ళలో చాలామంది సక్కనోళ్ళకు తెలుగే సరిగ్గా రాదు. ఇక వేరే భాషలేమొస్తాయి? ఇది ఎదో ఓబుసుపోక ఎవర్నో తిట్టాలని అక్కసు వెళ్లగక్కే అభిప్రాయం కాదు. రీసెర్చ్ లు చెప్పేదేంటంటే ఎవరికైతే మాతృభాష మీద పట్టు ఉంటుందో వారికి ఇతర భాషలపై త్వరగా పట్టు దొరుకుతుందట. మరి అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమనే సామెత వచ్చిందేమో. ఇప్పుడు ఈ భాషల టాపిక్ ఎందుకు వచ్చిందంటే మన వీర రాఘవుడు ఈధ్య అరవింద షూటింగ్ సమయంలో టీమ్ మెంబర్స్ కు షాక్ ఇచ్చాడట.

ఎన్టీఆర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడటతాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చేతికి మైక్ ఇస్తే అనర్గళంగా మాట్లాడుతూ అచ్చం తాతగారిలా గా చెలరేగిపోతాడు. 'యమదొంగ' లాంటి సినిమాలలో చాంతాడంత పొడవైన తెలుగు వాక్యాలను అవలీలగా పలికి 'ఎనీ డౌట్స్' అని అడిగిన అనుభవం కూడా ఉంది. హరికృష్ణ గారి మరణం తర్వాత 'అరవింద సమేత' షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కు తన అమ్మగారి వైపు బంధువుల నుండి ఒక సారి కాల్ వచ్చిందట. ఫోన్ లో గడగడా కన్నడ మాట్లాడడం చూసి కొందరు యూనిట్ మెంబర్స్ నోరెళ్ళబెట్టారట. ఎన్టీఆర్ కు కన్నడ తెలుసని అందరికీ తెలుసు గానీ గడగడామాట్లడతాడని మాత్రం తెలియదు.

ఎన్టీఆర్ అమ్మ షాలిని గారిది కర్ణాటక. తెలుగువారే అయినప్పటికీ వారి కుటుంబాలు తాతలకాలం లోనే బళ్లారి.. రాయచూర్ లో స్థిరపడ్డారట. ఎన్టీఆర్ తన అమ్మగారి తరపు బంధువులు వద్దకు చాలా సార్లు వెళ్ళి వస్తుండడంతోనే కన్నడ అలా మాట్లాడడం వచ్చిందట.