Begin typing your search above and press return to search.

తారక్ వెనుక 4 లక్షల మంది

By:  Tupaki Desk   |   11 Sep 2015 9:30 AM GMT
తారక్ వెనుక 4 లక్షల మంది
X
ఇంతకుముందులా హీరోలు మడిగట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ఈ రోజుల్లో ప్రమోషన్ లేకుండా సినిమానే లేదు కాబట్టి అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. వ్యక్తిగత విషయాలకు సంబంధించి లేని పోని రూమర్లకు అడ్డుకట్ట వేయాలన్నా, అభిమానులకు ఏదైనా చెప్పాలన్నా తమకంటూ ఓ వేదిక ఉండాలి. అందుకే ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా అకౌంట్ లు తెరిచి అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు మన హీరోలు. టాలీవుడ్ లో మహేష్ తో మొదలైన ఈ ట్రెండు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు కూడా పాకింది. ఎన్టీఆర్ మరీ అంత యాక్టివ్ గా ఏమీ ఉండడు. అప్పుడప్పుడూ ఓ ట్వీట్ చేస్తాడు. ఆ మాత్రానికే అతడికి 4 లక్షల మంది ఫాలోయర్లు తయారయ్యారు. ఈ మధ్యే 4 లక్షల ఫాలోవర్స్ క్లబ్ లో చేరాడు ఎన్టీఆర్.

ఐతే నిజానికీ నంబర్ చాలా తక్కువ. హీరోలు ఎంత యాక్టివ్ గా ఉంటే అభిమానులు అంత ఎక్కువగా ఫాలో అవుతారు. మహేష్ బాబు ఒకప్పుడు చాలా యాక్టివ్ గా ఉండి.. తన ఫాలోయర్ల సంఖ్యను బాగా పెంచుకున్నాడు. అతణ్ని 15 లక్షల 80 వేల మంది అనుసరిస్తున్నారు. నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉండటమే కాక.. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే దగ్గుబాటి రానా 11 లక్షల 60 వేల మంది ఫాలోయర్ లను కలిగి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ను 6.38 లక్షలమంది అనుసరిస్తున్నారు. ఈ మధ్యే ట్విట్టర్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్ వెంట 2.89 లక్షల మంది ఉన్నారు. ఐతే మన హీరోలతో పోలిస్తే హీరోయిన్ ల జోరు మామూలుగా లేదు. వాళ్లు ప్రతి రోజూ ట్విట్టర్ లో కూత పెట్టకుండా నిద్ర పోరు. త్రిష ఈ మధ్యే 2 మిలియన్ క్లబ్ (20 లక్షల మంది)లో అడుగుపెట్టింది. సమంతకు కూడా దాదాపు 17 లక్షల మంది ఫాలోయిర్లుండటం విశేషం.