Begin typing your search above and press return to search.

రాత్రిపూట ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే

By:  Tupaki Desk   |   3 July 2016 9:30 AM GMT
రాత్రిపూట ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడో టార్గెట్ ఉంది. ఆగస్ట్ 12వ తేదీన జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేయాలని ఎప్పుడో నిర్ణయించిన ఎన్టీఆర్.. కొన్ని నెలల పాటు రెస్ట్ కూడా తీసుకోకుండానే షూటింగ్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న జతనా గ్యారేజ్ కు.. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిపోయింది. ఇక పెండింగ్ ఉన్నవి కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు.. పాటలు మాత్రమే.

పాటల కోసం శ్రీలంక షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్న కొరటాల అండ్ టీమ్.. ఈ నెల రెండో వారంలో అక్కడికి బయల్దేరనున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని సారధి స్టూడియోస్ లో భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రాత్రి పూట వచ్చే ఈ ఫైటింగ్ సీన్ కోసం.. కొన్ని రోజులుగా నైట్ టైమ్ షూటింగ్ చేస్తున్నారట. మరికొన్ని రోజుల్లో ఇది పూర్తి కానుండగా.. మరో ఫైట్ ను డే లైట్ లో చిత్రీకరించనున్నారు. వీటి తర్వాత శ్రీలంక షెడ్యూల్ కి వెళ్లనున్నారు జనతా గ్యారేజ్ యూనిట్.

ఆగస్ట్ 12 రిలీజ్ డేట్ విషయంలో జనతా గ్యారేజ్ ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. అదే రోజున బాలీవుడ్ భారీ చిత్రాలు మొహెంజొదారో, రుస్తొంలు విడుదలవుతుండడంతో.. యూఎస్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉన్నా.. ఇప్పటి నుంచి స్క్రీన్స్ ను బ్లాక్ చేయాలనే సూచనలు చేశారట. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ సాధించాలనే నందమూరి అభిమానుల ఆశలను నిలబెట్టేందుకు దర్శకుడు కొరటాల బాగానే కష్టపడుతున్నాడని యూనిట్ నుంచి టాక్ వినిపిస్తోంది.