Begin typing your search above and press return to search.

'మహేష్-రాజమౌళి' ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 10:35 AM GMT
మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్స్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పదకొండేళ్ల క్రిందటే ఈ క్రేజీ కాంబోలో చర్చలు జరుగగా.. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చబోతోంది. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత తాను మహేష్ తో సినిమా చేయనున్నట్లు ఏడాది క్రితమే జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఇటీవల 'మై హీరో' అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. ఇప్పుడు RRR ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి మరోసారి మహేష్ సినిమా గురించి మాట్లాడారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ప్రస్తావించారు. ''నేను మహేష్ తో ఓ సినిమా ప్రకటించి ఉన్నాను. ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఇప్పటికే మా నాన్నతో డిస్కష్ చేసా. ఆయన కొన్ని ఐడియాస్ అనుకున్నారు. కాకపోతే వాటి మీద డీఫ్ గా ఇంకా ఆలోచించలేదు. ఇది కచ్చితంగా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని జక్కన్న తెలిపారు.

''మహేష్ బాబుకు థాంక్స్ చెప్పాలి. సంక్రాంతి రిలీజుల విషయంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులను పరిష్కరించే విధంగా మొదటగా నిర్ణయం తీసుకున్న వ్యక్తి మహేష్. లాజికల్ గా ఆలోచించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు'' అని రాజమౌళి అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కలుగజేసుకొని మహేష్ - రాజమౌళి సినిమా గురించి ఖచ్చితమైన సమాచారం తనకు తెలుసని.. ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందని చెప్పి నవ్వులు పూయించారు.

దీనికి రాజమౌళి స్పందిస్తూ ‘నో వే’ అని అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ అందుకొని.. డిస్కషన్స్ జరిగి షూటింగ్ మొదలవ్వడానికి 2023 పడుతుందని.. కరోనా పాండమిక్ వంటి ఇబ్బందులు లేకపోతే 2025 కల్లా వచ్చేయొచ్చులే అని ఫన్నీగా చెప్పారు. 2025లో మళ్ళీ మీరు ఇక్కడే ఇంటర్వ్యూ చేయొచ్చని.. ఈ స్థానంలో మహేష్ ఉంటారని తారక్ తెలిపారు. పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా దీనికి వంత పాడారు. మహేష్ - రాజమౌళి ప్రాజెక్ట్ విషయంలో తారక్ - చరణ్ మాట్లాడిన ఫన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే ఇటీవల ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమానికి మహేష్ బాబు గెస్టుగా వచ్చినప్పుడు కూడా.. రాజమౌళితో వర్క్ చేయడం గురించి ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జక్కన్నతో సినిమా చేస్తున్నావ్ గా.. ఒక్క క్రికెట్ ఏమిటి.. అన్ని ఆటలు ఆడిస్తాడులే, తొందరెందుకు? అని మహేష్ బాబుతో కలిసి తారక్ హాస్యాన్ని పండించారు.

కాగా, రాజమౌళితో సినిమా కోసం చేతులు కలపడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నానని.. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మహేష్ ఇది వరకే పేర్కొన్నారు. 'సర్కారు వారి పాట' 'SSMB28' చిత్రాల తర్వాత జక్కన్న ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచరస్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ మహేష్ బాబు - రాజమౌళి చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్. గోపాల్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాజమౌళి గత చిత్రాలకు వర్క్ చేసే టెక్నికల్ టీమ్ అంతా ఇందులో కూడా భాగం కానున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తారేమో చూడాలి.