Begin typing your search above and press return to search.

చరణ్ మాటలకు ఉద్వేగానికి లోనైన ఎన్టీఆర్!

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:31 AM GMT
చరణ్ మాటలకు ఉద్వేగానికి లోనైన ఎన్టీఆర్!
X
ఇప్పుడు అందరి చూపు 'ఆర్ ఆర్ ఆర్' వైపే ఉంది .. అందరి లక్ష్యం ఈ సినిమా టిక్కెట్లు దక్కించుకోవడంగా ఉంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ తో నిర్మించారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు. ఉదయనిధి స్టాలిన్ .. శివ కార్తికేయన్ గౌరవ అతిథులుగా వచ్చిన ఈ వేదికపై చరణ్ మాట్లాడాడు.

"ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మా బ్రదర్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. నిజంగా ఏ సిటీకి వెళ్లినా ఒక్కటి మాత్రం మారడం లేదు. ఇలా ఎంతో అభిమానంతో అంతా వస్తున్నారు .. చాలా ఆనందంగా ఉంది. తారక్ చెప్పినట్టుగా నేను కూడా చాలా తక్కువ సమయంలో నా స్పీచ్ ను కంప్లీట్ చేస్తాను. ముందుగా లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయనతో ఎప్పటి నుంచో కలిసి పని చేయాలనుకున్నాను .. ఆ కోరిక 'ఆర్ ఆర్ ఆర్'తో నెరవేరింది. అలాగే మా డైనమిక్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంత పెద్ద సినిమా చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు.

ఇక చివరిగా మా గురువు అనాలా? ప్రిన్సిపల్ అనాలా? హెడ్ మాస్టర్ అనాలా? నా గైడ్ అనాలా? ఇండస్ట్రీలో నాకు ఫస్టు హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా? మా ఇద్దరినీ కలిపి ఒక సినిమా తీసినందుకు రాజమౌళి గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఆయన గురించి చెప్పాలంటే ఒక స్టేజ్ సరిపోదు. అలాగే ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పని చేసిన టీమ్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక తారక్ విషయానికి వస్తే వయసులో మా మధ్య కొంత తేడా ఉంది. ఆయనది చిన్నపిల్లాడి మెంటాలిటీ .. లయన్ మాదిరి పర్సనాలిటీ. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తితో.

నేను తారక్ కి థ్యాంక్స్ చెప్పను .. ఎందుకంటే అలా చెబితే ఆయనతో ఉన్న అనుబంధానికి ఇక్కడితో ముగింపు పలికినట్టుగా అవుతుంది. తారక్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నాను. మొదటి నుంచి మేము ఇద్దరం మంచి స్నేహితులం .. ఈ సినిమాతో అది మరింత బలపడింది. ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. నేను చనిపోయేవరకూ ఈ బంధాన్ని నా మనసులో పెట్టుకుంటాను" అన్నాడు. ఆ మాటలకు అక్కడి అభిమానులంతా ఈలలతో గోల చేశారు. ఎన్టీఆర్ మాత్రం చప్పట్లు కొడుతూనే ఉద్వేగానికి లోనైనట్టుగా కనిపించాడు.