Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై ట్రాల్స్ రెచ్చిపోతున్నారు

By:  Tupaki Desk   |   18 Sept 2017 6:33 PM IST
ఎన్టీఆర్ పై ట్రాల్స్ రెచ్చిపోతున్నారు
X
ప్రస్తుత రోజుల్లో ఏ విషయంపైన అయినా ట్రోల్స్ వెయ్యడం కామన్ అయిపొయింది. టాలీవుడ్ లో కొందరి హీరోల ఫ్యాన్స్ వారి అభిమాన హీరోలపై ప్రేమను చూపెట్టడం కంటే ఇతర హీరోలపై అవహేళన చేయడంపైనా ఎక్కువ ఏకాగ్రత వహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయినప్పటి నుండి ఈ తరహా గొడవలకు హద్దు లేకుండా పోయింది.

రోజుకో వివాదం సోషల్ మీడియాలో చెలరేగుతోంది. అయితే ఇప్పుడు అదే తరహాలో కొందరు ఎన్టీఆర్ జై లవకుశ సినిమాపై కూడా ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు. జై లవకుశ సినిమా కోసం తారక్ చాలా కష్టపడిన విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా అందులో జై పాత్ర కోసం చాలా కష్టపడినట్లు జై లవకుశ చిత్ర యూనిట్ మొత్తం ప్రతి మీడియా సమావేశాల్లో మరియు ప్రమోషన్స్ వేడుకలలో పదే పదే చెప్పారు. ముఖ్యంగా కళ్యాణ్‌ రామ్ అయితే.. రాత్రి నిద్రలో ఎన్టీఆర్ ఏం చేశాడో చెప్పాడు. అదే విషయం మొన్న ఒక ఇంటర్యూలో ఎన్టీఆర్ కూడా చెప్పాడు. జై పాత్రలో అంతగా లీనమైయ్యాను అన్నాడు. అయితే వీటన్నటి కంటే ఎక్కువ స్థాయిలో రీసెంట్ గా ఎన్టీఆర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి తాను చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

తాను ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు చెప్పడం బాగానే ఉంది అయితే జై పాత్ర కోసం జై పాత్ర నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డాను అని అలాగే జై పాత్ర ప్రబావం వల్ల నిద్రలో సడన్ గా మెలకువ వచ్చి ఏదేదో మాట్లాడానని ఎన్టీఆర్ చెప్పడం పై కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నిద్రలోంచి లేచి కిటికీలోంచి దూకేయాలన్న ప్రయత్నంలో అక్కడ వేలాడాను అనడంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై కొందరు నందమూరి అభిమానులు మాత్రం చాలా కోపంగా ఉన్నారు.