Begin typing your search above and press return to search.

బాలయ్య పిలవలేదు.. ఎన్టీఆర్ కామెంట్

By:  Tupaki Desk   |   3 April 2018 5:24 PM GMT
బాలయ్య పిలవలేదు.. ఎన్టీఆర్ కామెంట్
X
నందమూరి ఫ్యామిలీలో అత్యధిక బిజినెస్ ఉన్న హీరోల్లో ఎవరు మొదట ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే ఆ ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధాలు ఎలా ఉంటాయో కూడా తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ - ఎన్టీఆర్ కటౌట్స్ బయట కనిపించినప్పటికి వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో వివరించక్కర్లేదు.

ఇక బాలయ్య గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా కూడా తారక్ మాత్రం ఎప్పుడు తడబడలేదు. బాబాయ్ అంటూ చాలా చక్కగా మాట్లాడతాడు. కానీ బాలకృష్ణ గారు మాత్ర అన్నయ్య కొడుకు పేరుని పలికిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి రావడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు స్పనదించకపోరా అని అంతా అనుకున్నారు. బాలయ్య అయితే మళ్లీ అదే శైలి చూపించాడు. ఎన్టీఆర్ కూడా మళ్లీ తన నిర్మలమైన మనస్సుతో ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. రీసెంట్ గా ఐపీఎల్ తెలుగుకి సంబంధించిన ప్రెస్ మీట్ లో బయోపిక్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఎన్టీఆర్ చాలా స్వీట్ గా సమాధానం ఇచ్చారు.

సినిమాలో ఏ పాత్ర అయినా చేయాలని అనుకుంటున్నారా? మొన్న ఓపెనింగ్ కు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు.. ''ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. ఒక వేళ నా వరకు వస్తే తప్పకుండా మీకు చెబుతాను'' అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. ఇంతకుముందు బయోపిక్ లపై నటించే అవకాశం ఏమైనా ఉందా అని అంటే.. అలాంటి వాటిలో నటించాలంటే కొంచెం కష్టం. జాతీయ స్థాయి నటీనటుల తరహాలో నటించాలంటే బయమని తారక్ వివరించాడు.