Begin typing your search above and press return to search.
ఆ రూమర్లలో నిజం లేదన్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 9 July 2017 6:38 AM GMTఈ మధ్య ఎన్టీఆర్ గురించి చేస్తున్న ‘బిగ్ బాస్’ షో గురించి కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ షో షూటింగ్ కోసం ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నాడని.. దీని కోసం ఏకంగా 70 రోజుల పాటు షూటింగులో పాల్గొనబోతున్నాడని.. దీని కోసమే పుణెకు మకాం మారుస్తున్నాడని.. ‘జై లవకుశ’ షూటింగ్ సైతం పుణెలో పెట్టడానికి ఇదే కారణమని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిపైనా ఎన్టీఆర్ స్పందించాడు.
‘‘నా భార్య, బిడ్డల్ని చక్కగా చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గరుంది. బిగ్ బాస్ షో పారితోషికం గురించి నేను అంతగా ఆలోచించలేదు. షోకి తగ్గ పేమెంట్ అయితే ఇస్తారు. మా ‘జై లవకుశ’కు సంబంధించి పుణె దగ్గర్లోని లొకేషన్లను ఇది వరకే ఎంపిక చేశాం. అదృష్టం కొద్దీ ‘బిగ్ బాస్’ షో కూడా అక్కడే చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే తప్ప కావాలని రెండూ ఒక చోట పెట్టాలేదు. నేను 70 రోజుల పాటు ఈ షో షూటింగులో పాల్గొంటానన్నదీ వాస్తవం కాదు. వారంలో ఏడు రోజులూ రాత్రి పూట వచ్చే ఈ షోలో సోమవారం నుంచి శుక్రవారం దాకా పోటీదారులే కనిపిస్తారు. శని.. ఆదివారాలు మాత్రమే హోస్ట్ కనిపిస్తాడు. కాబట్టి ఆ రోజులకు సంబంధించిన ఎపిసోడ్లలో మాత్రం షూటింగ్‌లో పాల్గొంటే చాలు. బిగ్ బాస్ హౌస్ లో పోటీదారుల మధ్య జరిగేది నేను చూడాలనుకుంటున్నాను కానీ.. అక్కడే ఉండాలనుకోవడం లేదు’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.