Begin typing your search above and press return to search.

మహానటి లో నేను లేను

By:  Tupaki Desk   |   21 Sep 2017 5:30 PM GMT
మహానటి లో నేను లేను
X
బయోపిక్ లు తీయాలంటే గడిచిన గతం గురించి చాలా తెలుసుకోవాలి. ఒకప్పటి నిజమెంతో తెలియదు. ఆ నిజం లేకపోయినా పర్వాలేదు కానీ అబద్దం మాత్రం ఉండకూడదు. కథ కోసం ఎంతో అన్వేషణను చేస్తేనే మంచి బయోపిక్ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది అది మిస్ అవుతున్నారు, కల్పిత సన్నివేశాలను ఎక్కువగా జోడిస్తున్నారు. అయితే అలాంటివి చేసినా కొంతమంది అద్భుతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం "మాహానటి" సావిత్రి బయోపిక్ కోసం కూడా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు . అయితే సినిమాలో ఇప్పటికే కొన్ని పాత్రలను ఫైనల్ చేసిన దర్శకుడు మరి కొన్నిపాత్రలకు ఎవరిని సెలెక్ట్ చేయాలన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు సావిత్రి జీవితంలో చాలా కీలకం. ఆమె వారితో ఎన్నో సినిమాల్లో నటించింది. వారు ఆ సినిమాల్లో లేకుంటే కథకు అసలైన అర్ధం ఉండదు. అయితే రామారావు పాత్రకు అయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేస్తారేమో అని అందరు అనుకున్నారు.

కానీ తారక్ మాత్రం తనను ఎవ్వరు కలవలేదని చెబుతున్నాడు. మహానటి సినిమాలో తాతగారి రోల్ లో నటిస్తున్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని తారక్ కొట్టి పారేశారు. అంతే కాకూండా తాను మాత్రమే నటించాలని రూల్ ఏమి లేదని చెబుతూ.. ఎవరైనా నటించవచ్చని చెప్పాడు. అలాగే ఆ పాత్ర చేయడం చాలా కష్టం అని కూడా తారక్ చెప్పాడు. మరి తారక్ నటించకుంటే ఆ పాత్రకు ఎవరిని సెలెక్ట్ చేస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను జరుపుకుంటోంది. సావిత్రి పాత్రలో "కీర్తి సురేష్" నటిస్తున్న సంగతి తెలిసిందే.