Begin typing your search above and press return to search.

తారక్ జోడి సెట్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   28 May 2019 4:18 AM GMT
తారక్ జోడి సెట్ అయ్యిందా?
X
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ఒకటి షూట్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు చేస్తున్నప్పుడే తారక్ చేతికి చిన్న గాయం కావడం వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో కంటిన్యూ అవుతోంది . చరణ్ నేరుగా అహ్మదాబాద్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని తెలిసింది. తానూ సెట్ అయిపోయాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ జూనియర్ పక్కన హీరోయిన్ మాత్రం ఇప్పటిదాకా ఎవరో తెలియకపోవడంతో యంగ్ టైగర్ ఫాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో డైసీ ఎడ్గార్ పేరు అనౌన్స్ చేసిన రాజమౌళి తర్వాత ఏవో వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుందని చెప్పాడు. ఇక అప్పటి నుంచి వేరే భామ కోసం వేట సాగుతూనే ఉంది

రామ్ చరణ్ పక్కన ఎంపికైన అలియా భట్ ఎప్పుడెప్పుడు సెట్ లోకి అడుగు పెడదామా అని ఎదురు చూస్తోంది. ఇటు చూస్తేనేమో తారక్ కు జోడి సమస్య. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం రాజమౌళి మరో విదేశీ భామను ఎంపిక చేసుకున్నాడట. డైసీ కన్నా బెటర్ ఛాయస్ అనిపించేలా ఉన్న ఆ బ్యూటీ ఎవరో త్వరలో ట్వీట్ చేస్తారని తెలిసింది. గతంలో కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి కాని కథ ప్రకారం ఆ పాత్ర ఖచ్చితంగా విదేశీయురాలు అయ్యుండాలి. అందుకే కొంత ఆలస్యమైనా వలవేసి పట్టినట్టు తెలిసింది. ఇంతకీ ఆ ఫారిన్ సుందరి ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే