Begin typing your search above and press return to search.
ఆరేళ్ళ తర్వాత సంక్రాంతి బరిలో యంగ్ టైగర్
By: Tupaki Desk | 12 Jan 2016 5:30 PM GMTతెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుగు సినిమాల వ్యాపార పరంగా సంక్రాంతి సీజన్ కి అంతే ప్రాధాన్యత ఉందనడంలో మరో ఆలోచన అవసరం లేదు. అందుకే మన సినిమా వాళ్ళు పండగ మూడ్ కి తగినట్టు అన్ని రకాల హంగులతో తెలుగు ప్రేక్షకులు మెచ్చే సినిమాలను సంక్రాంతి బరిలోకి దింపుతారు. ఇక హీరోల విషయానికొస్తే నాటి నుండి నేటి వరకూ సంక్రాంతి హీరోలనిపించుకున్న వారి లిస్టు కాస్త పెద్దదే. ఆ కోవలోనే ఆరేళ్ళ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాతో రేపు తెరమీదికి రానున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ గురించి చెప్పే ముందు అతడు సంక్రాంతి హీరో కాదన్నది గమనించాలి. ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా జూలై నుండి దసరా మధ్యలోనే విడుదలయ్యాయి. ఇప్పటివరకూ 25 సినిమాలు చేసిన ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద పండక్కి వచ్చినవి కేవలం 4 సినిమాలే. వాటిలో మొదటిది నాగ (జనవరి 10 2003), రెండోది ఆంధ్రావాలా (జనవరి 2 2004), తర్వాత నా అల్లుడు (జనవరి 14 2005) కాగా అక్కడికి అయిదేళ్ళ తర్వాత అదుర్స్ (జనవరి 15 2010) విడుదలై ఎన్టీఆర్ కి తొలి సంక్రాంతి సక్సెస్ గా నిలిచింది. గతేడాది టెంపర్ విజయంతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సంక్రాంతి బొనాంజాగా నాన్నకి ప్రేమతో సినిమాని సిద్ధం చేశాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పటివరకూ వచ్చిన పాజిటివ్ టాక్ సూపర్ హిట్ గా మారేందుకు ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. ఈ సందర్భంగా 'నాన్నకు ప్రేమతో' చిత్ర బృందానికి తుపాకీ.కామ్ తరఫున ఆల్ ది బెస్ట్..!