Begin typing your search above and press return to search.
ఆర్జీవీ.. ఈసారి ఇందిర నమస్కారం!
By: Tupaki Desk | 17 Feb 2019 10:23 AM GMTఎలాంటి విషయం నుంచైనా పబ్లిసిటీ పిండుకోవడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిన వారు లేరు. సెన్సిటివ్ గా ఉండే అంశాలపై.. నెగెటివ్ అంశాలపై.. స్పందించేందుకు ఇతర ఫిలిం మేకర్లు ఎవరైనా వెనకడుగు వేస్తారు. కానీ ఆర్జీవీ మాత్రం ముందడుగే వేస్తారు. ఇప్పటికే వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఒక హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే.
సినిమా ట్రైలర్ రిలీజ్ ముందు వరకూ వర్మ చెప్పే విషయాలపై కొంతమందికి అనుమానాలు ఉన్నా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ రిలీజ్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ కు యూట్యూబ్ లో వస్తున్న రెస్పాన్సే దానికి నిదర్శనం. అసలే వర్మకు హిట్లు లేక.. తన సినిమాలను జనాలు పట్టించుకోకపోవడం దాదాపు గా మానేయడంతో కరువులో ఉన్నాడు. ఇక ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఎలా ఊరుకుంటాడు? మరింతగా రెచ్చిపోయి.. రెట్టించిన ఉత్సాహంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పబ్లిసిటీని కదం తొక్కిస్తున్నాడు.
రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ సినిమా 'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్లో ఇందిరా గాంధి కారులో ప్రయాణించే సమయంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు 'జై శ్రీకృష్ణ' అంటూ నమస్కరించే సీన్ ఒకటి ఉంది. పక్కనున్న వ్యక్తి 'మేడమ్.. వారు మన ప్రత్యర్థి' అని చెప్తారు. ఈ విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి.
సరిగ్గా ఈ సీన్ కు సంబంధించిన మీమ్ ను తనతన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఒక అతి క్లిష్టమైన.. మానవ మాత్రులకు అర్థం కాని ఆంగ్ల పదవిన్యాసంతో ట్వీట్ చేశాడు. దాన్ని తెలుగీకరిస్తే.. "సినిమా అనేది నిజాన్ని అబద్ధంతో భాగించి.. ఒక ఎజెండాకు అసత్యాన్ని జోడించి దాన్ని అబద్దమైన నిజాలతో గుణించి.. నిజమైన అబద్దాలను తీసివేయాలి". ఇది మీకు ఎంత అర్థం అయిందో మాకు అంతే అర్థం అయింది. ఆ అర్థం అయిన అర్థాన్ని మనం కూడా కూడికలు.. తీసివేతలు.. గుణించడం.. భాగించడాలు చేస్తే ఫైనల్ గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిజం అన్న అబద్ధమైన నిజం.. నిజమైన అబద్దం మిగులుతుంది.