Begin typing your search above and press return to search.
షాకింగ్ : చరణ్ లాగే ఎన్టీఆర్ కూడా
By: Tupaki Desk | 24 April 2019 7:40 AM GMTరాజమౌళి సినిమా అంటేనే గాయాలు అడ్డంకులు సర్వసాధారణం. అవి మధ్యలో వస్తే పర్వాలేదు కానీ షూటింగ్ ఇంకా పట్టుమని పాతిక శాతం పూర్తి కాకుండానే ఏర్పడితే అభిమానుల టెన్షన్ అంతా ఇంత ఉండదు . ఇప్పటికే చీలమండ గాయం వల్ల రామ్ చరణ్ మూడు వారాల బ్రేక్ తీసుకున్నాడు. దీని వల్ల మిగలిన టీం కూడా విశ్రాంతి తీసుకోక తప్పలేదు. తారక్ కూడా కొంత హాలిడేస్ ని ఎంజాయ్ చేశాడు.
తాజా అప్ డేట్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ పెట్టేలా ఉంది. దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చేతికి చిన్న గాయమయ్యింది. ఆ కట్టుతో ఉన్న ఫోటోలు కూడా లీకు రూపంలో బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. అంటే ఈ గాయం కూడా ఇక్కడిదే అన్న మాట. లొకేషన్ లో ఉండగా ఇది జరిగిందా లేక తారక్ కు పర్సనల్ గా జరిగిన గాయమా అనే క్లారిటీ లేదు.
ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ లో దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అభిమానులు ఖంగారు పడతారని పెట్టలేదో ఇంకే కారణమో తెలియలేదు. త్వరలో టీం పూణే బయలుదేరాల్సి ఉంది. ఇప్పటికే వచ్చిన నెల రోజుల గ్యాప్ ను పూడ్చుకుంటూ రాజమౌళి మిగిలిన పార్ట్ ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆర్టిస్టుల కాంబినేషన్ లో కాల్ షీట్స్ సెట్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతం ఆ ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడీ ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి