Begin typing your search above and press return to search.
నేనెప్పుడూ హిట్టు డైరెక్టర్ల వెంట పడలే
By: Tupaki Desk | 10 Jan 2016 7:30 AM GMTయంగ్ యమ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో పోస్టర్ వివాదం మర్చిపోకముందే మరో కాంట్రవర్శియల్ సబ్జెక్టుపై క్లారిటీ ఇచ్చాడు. ఇది మరీ అంత వివాదాస్పద టాపిక్ కాకపోయినా చాలా కాలంగా ఎన్టీఆర్ ని చికాకు పెట్టేస్తున్నటాపిక్ ఇది. అందుకే అతడు మీడియా ముందుకు వచ్చి మరీ క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ర్టీలో ఏ డైరెక్టర్ అయినా హిట్టు కొట్టేస్తే చాలు ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ వెంటపడిపోతాడు అన్న ఓ విమర్శ ఉంది. అలా వెంటపడి అప్పట్లో హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా చేశాడు. ఇప్పుడు కొరటాలతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇదే విషయం తననే అడిగేస్తే తారక్ ఓ క్లారిటీ ఇచ్చాడు.
నేనెప్పుడూ హిట్టు డైరెక్టర్ల వెంట పడలేదు. కథని నమ్మి సినిమాలు చేసానంతే. రాజమౌళి - వి.వి.వినాయక్ - వంశీ పైడిపల్లి - వరా ముళ్లపూడి వంటి దర్శకులతో పనిచేసాను. వాళ్లతో నేను సినిమాలు చేసేప్పటికి వారెవరికీ హిట్లు అనేవే లేవు. ..కథే నడిపిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు.. ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ .. నేను నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. అప్పట్లో లండన్ వెళ్లినప్పుడు అభయ్ రామ్ ఏం కావాలని అడిగితే అది కొనిచ్చాను. బోలెడంత షాపింగ్ చేసేశాను. అలాగే నా ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ దుబాయ్. అక్కడ ఫ్యాషన్స్ - ట్రెండ్స్ అదిరిపోతాయ్. నా షాపింగ్ అంతా అక్కడే అని చెప్పాడు ఎన్టీఆర్.