Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అంత శ్రద్ధగా ఫాలో అవుతాడన్నమాట

By:  Tupaki Desk   |   10 Jan 2016 7:30 PM GMT
ఎన్టీఆర్ అంత శ్రద్ధగా ఫాలో అవుతాడన్నమాట
X
మన స్టార్ హీరోలకు తమ సినిమాల సంగతి తప్ప ఇంకేమీ పట్టదని అనుకుంటాం. వేరే సినిమాలు చూడరేమో.. సినిమా వార్తలు ఫాలో అవరేమో.. ప్రపంచ సినిమాను పట్టించుకోరేమో.. గాసిప్స్ గురించి, రూమర్ల గురించి అస్సలు ఆలోచించరేమో అని భావిస్తాం. కానీ నిన్న ఎన్టీఆర్ ప్రెస్ మీట్ చూశాక మిగతావాళ్ల సంగతేమో కానీ.. అతడి విషయంలో మాత్రం ఈ అభిప్రాయాలన్నీ మార్చుకోవాల్సిందే.

ఎన్టీఆర్ మీడియాను ఎంత ఫాలో అవుతాడు.. రూమర్ల గురించి ఎంతగా పట్టించుకుంటాడు.. ప్రపంచ సినిమాపై అతడికి ఎంత అవగాహన ఉంది.. అన్నది స్పష్టంగా అర్థమైంది. ఎన్టీఆర్ హిట్టు డైరెక్టర్లతోనే పని చేస్తాడు అని ఒకప్పుడు రూమర్లు వినిపించేవి గుర్తుందా? దాని గురించి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఈ వార్తలన్నింటినీ ఫాలో అయ్యాడని అతడి మాటల్ని బట్టి తెలిసింది. ప్రపంచంలో తన మీద ఉన్నన్ని రూమర్లు ఇంకెవరి మీదా ఉండవని చెబుతూ.. తాను హిట్టు డైరెక్టర్లతో మాత్రమే పని చేస్తానన్న అభిప్రాయం సరికాదని వివరించాడు ఎన్టీఆర్. గత కొన్ని రోజులుగా నందమూరి కుటుంబంలో నడుస్తున్న కోల్డ్ వార్ కు సంబంధించిన వార్తలన్నీ కూడా ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడని అతడి మాటల్ని బట్టి అర్థమైంది. బాబాయితో తనకెలాంటి గొడవల్లేవని చెబుతూ.. ఈ విషయంలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించాడు ఎన్టీఆర్.

ఇక సుకుమార్ గురించి చెబుతూ.. అతను చాలా స్లో అని, ఒక చిన్న షాట్ తీయాలన్నా టైం తీసుకుంటాడని.. క్లారిటీ ఉండదని విన్నానని.. అతడితో పనిచేశాక అన్నీ అబద్ధమని తేలిందని చెప్పాడు ఎన్టీఆర్. అంటే సుక్కు విషయంలో వచ్చిన రూమర్లన్నీ కూడా బాగా ఫాలో అయ్యాడన్నమాట ఎన్టీఆర్. ఇక ‘శంకరాభరణం’ తరహా సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమని చెబుతూ.. విల్ స్మిత్ లాంటి యాక్షన్ స్టార్ ‘పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’ చేయడం గురించి, మరో హాలీవుడ్ స్టార్ చేసిన వైవిధ్యమైన సినిమాల గురించి ప్రస్తావించాడు జూనియర్. దీన్ని బట్టి అతను వరల్డ్ సినిమాను ఎంత కీన్ గా ఫాలో అవుతాడో అర్థమైంది. మొత్తానికి ఎన్టీఆర్ కు చాలా విషయాలపై అవగాహన ఉందని.. మీడియాను శ్రద్ధగా ఫాలో కావడమే కాక.. వరల్డ్ సినిమా మీద బాగానే అవగాహన పెంచుకున్నాడని నిన్నటి ప్రెస్ మీట్ తో అందరికీ బాగానే తెలిసొచ్చింది.