Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ తో `వెరైటీ` ఇంట‌ర్వ్యూ!

By:  Tupaki Desk   |   6 Jan 2023 12:38 PM GMT
యంగ్ టైగ‌ర్ తో `వెరైటీ` ఇంట‌ర్వ్యూ!
X
టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించ‌న భారీ  పాన్ ఇండియా మల్టీస్టార‌ర్ `RRR`. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డులు తిర‌గ‌రాసింది.
 
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీపై విదేశీ ప్రేక్ష‌కులు, హాలీవుడ్ స్టార్స్, అండ్ టెక్నీషియ‌న్స్, డైరెక్ట‌ర్స్ ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు ఆవార్డుల్ని ద‌క్కించుకుంటున్న `RRR` తాజాగా మ‌రో పుర‌స్కారాన్ని త‌న ఖాతాలో వేసుకున్న న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డుల్లో రాజ‌మౌళి `RRR` మూవీకి గానూ ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

త్వ‌ర‌లో గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల్లోనూ `RRR` టీమ్ పాల్గొన బోతోంది. రెండు విభాగాల్లో `RRR` పోటీప‌డుతోంది. లాస్ ఏంజిల్స్ లో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు ఉత్త‌మ న‌టుడిగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ల‌భించే అవ‌కాశం వుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ టాప్ 10 బెస్ట్ యాక్ట‌ర్స్ ప్రెడిక్ష‌న్స్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానాం సంపాదించుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

జ‌న‌వ‌రి 10న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఇందులో ఎన్టీఆర్ స‌త్తా చాట‌డం ఖాయం అని, అంతే కాకుండా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల్లోనూ ఉత్త‌మ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకోవ‌డం ఖాయం అంటూ అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ వెరైటీ పేర్కొంది. ఈ నేప‌థ్యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని వెరైటీ మ్యాగ‌జైన్ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేస్తోంది.

వెరైటీ మ్యాగ‌జైన్ అవార్డ్స్ సీనియ‌ర్ ఎడిట‌ర్ డేవిస్.. ఎన్టీఆర్ ని లాస్ ఏంజిల్స్ లో ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేస్తున్నారు. వెరైటీ మ్యాగ‌జైన్ అవార్డ్స్ సీనియ‌ర్ ఎడిట‌ర్ డేవిస్.. ఎన్టీఆర్ ని క‌లిశారు. ఇప్ప‌టికే ఇంట‌ర్వ్యూ షూటింగ్ మొద‌లైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.