Begin typing your search above and press return to search.

రాములిద్దరు.. ఒకరికి ఒకరు..

By:  Tupaki Desk   |   29 Sept 2015 4:00 AM IST
రాములిద్దరు.. ఒకరికి ఒకరు..
X
సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం కోసం.. రెండున్నర నెలలపాటు ఫారిన్ షెడ్యూల్స్ చేసిన జూ. ఎన్టీఆర్.. రీసెంట్ గా ఇండియా వచ్చాడు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు ప్రస్తుతం. అక్టోబర్ రెండోవారంలో నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

దీనికి ముందు.. అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన షేర్ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నాడు. అక్టోబర్ 10న షేర్ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య వీరిద్దరి మధ్య అనుబంధం గట్టిగానే బలపడినట్లుగా అనిపిస్తోంది. ఒకళ్ల సినిమాలకు ఒకరు గెస్టులుగా వచ్చేస్తున్నారు. గతంలో అంటీముట్టనట్టుగా కనిపించినా.. ఇప్పుడు మాత్రం థిక్ ప్రెంఢ్స్ అయిపోయారు ఈ బ్రదర్స్. ముఖ్యంగా పటాస్ ఆడియో ఫంక్షన్ నుంచి.. అన్నాదమ్ములు అన్ని వేడుకల్లోనూ కలిసే కనిపిస్తున్నారు.

ఒకరకంగా ఇది మంచి సాంప్రదాయంగా చెప్పుకోవాలి. ప్యామిలీలో విబేధాలున్నాయనే ప్రచారానికి ఈ రకంగా చెక్ చెబ్తున్నారు ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు. సినిమాలకు కూడా ప్రచారం లభిస్తుండడంతో.. ఈ ట్రెండ్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ న్యూస్.. ప్రొడ్యూసర్లతో పాటు ఫ్యాన్స్ ను కూడా ఖుషీ చేసే విషయమే. ఆఫ్ స్క్రీన్ లో అన్నాదమ్ముల అనుబంధం... త్వరలో ఆన్ స్క్రీన్ పైకి వచ్చేసినా ఆశ్చర్యం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.