Begin typing your search above and press return to search.
నా డబ్బింగ్ నేనే చెప్తా..అంటున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 3 April 2020 11:30 AM GMTప్రస్తుతం భారతదేశ సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా 'రౌద్రం రుధిరం రణం' అదేనండి ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితగాథలతో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నాడు. ఇటీవలే మోషన్ పోస్టర్ తో, రాంచరణ్ అల్లూరి లుక్స్ తో ఆశ్చర్యపరిచిన ఆర్ఆర్ఆర్ గురించి మరో సెన్సేషనల్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి, డాన్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన రాంచరణ్ ఫస్ట్ లుక్ వీడియో కూడా ఎన్టీఆర్ వాయిస్ తో హైలైట్ అయిందని కొందరి అంచనా. ఆ వాయిస్ లో బేస్ అలాంటిది మరి. ఇక తాజా కథనాల ప్రకారం.. ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్దమయ్యాడట. రాంచరణ్ లుక్ కోసం విడుదలవుతున్న అన్నీ బాషలలో ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. హిందీలో కూడా ఎన్టీఆర్ వాయిస్ హైలైట్ అవ్వడం తో ఒకసారి డబ్బింగ్ టెస్ట్ చేసాడట రాజమౌళి. డైలాగ్ డెలివరీ తో కుమ్మేసే ఎన్టీఆర్ పేజీల మీద పేజీల డైలాగులను ఫటాఫట్ చెప్పేశాడట. అంతే రాజమౌళి ఊరుకుంటాడా.. హిందీలో నువ్వే డబ్బింగ్ చెప్పడానికి సిద్దంగా ఉండమని చెప్పాడట. ఎన్టీఆర్ కూడా హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పడానికి చాలా ఎక్సయిట్ గా ఉన్నట్లు సమాచారం. అంటే ఇక మన ఎన్టీఆర్ వాయిస్ ని హిందీ లో వినబోతున్నామని ఫ్యాన్స్ లో సందడి నెలకొంది.