Begin typing your search above and press return to search.

చరణ్‌ తో సినిమా.. తారక్ ఆలోచనట

By:  Tupaki Desk   |   13 Jun 2018 4:29 AM GMT
చరణ్‌ తో సినిమా.. తారక్ ఆలోచనట
X
బాహుబలి ఘన విజయంతో దేశం మొత్తం రాజమౌళి గొప్పతనాన్ని గుర్తించింది. అప్పటి నుంచి జక్కన్న తరవాత ఏది డైరెక్ట్ చేయబోతున్నాడా అని అంతా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనిపై రాజమౌళి పెదవి విప్పి ఒక్క మాట చెప్పలేదు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తో కలిసున్న ఫొటో ఒక్కటి సోషల్ మీడియాలో పోస్టు చేసి వదిలేశాడు.

రాజమౌళి ఈ పోస్టుతో తెలుగులోనే అతిపెద్ద మల్టీస్టారర్ తీయబోతున్నాడని తేలిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పై ఇద్దరు హీరోల అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా కొన్ని నెలల టైం ఉంది. అసలు రాజమౌళి ఈ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ కే వినిపించాడని.. రెండో హీరోగా చరణ్ ను తీసుకోవాలన్నది తారక్ ఆలోచనేనని తాజాగా రూమర్ బయటకొచ్చింది.

రాజమౌళి ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అతడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడంటూ తేల్చేశారు. ఇప్పుడు రాజమౌళి డేట్స్ అడిగితే కాదనే హీరోయే లేడు. అలాంటప్పుడు హీరోగా ఎవరిని తీసుకోవాలనే ఛాయిస్ వేరొకరికి ఇచ్చే అవకాశం తక్కువ. కాస్టింగ్ విషయంలో రాజమౌళి చాలా కాలిక్యులేటెడ్ గానే ఉంటాడు. అలాంటప్పుడు ఈ రూమర్ లో కొంతవరకే నిజముందని అనుకోవచ్చు.