Begin typing your search above and press return to search.

జై లవకుశ.. ఆడియో లాంచ్ క్యాన్సిలైంది

By:  Tupaki Desk   |   30 Aug 2017 9:54 AM GMT
జై లవకుశ.. ఆడియో లాంచ్ క్యాన్సిలైంది
X
ఎప్పుడెప్పుడు 'జూ లవ కుశ' ఆడియోను విందామా అనుకున్నవారికి ఎటువంటి ఇబ్బందీ లేదు కాని.. ఎప్పుడెప్పుడు ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ అండ్ ఇతరుల స్పీచ్ లను విని తరిద్దాం అనుకుంటే మాత్రం.. వారికి ఇప్పుడు కాస్త నిరాశే. ఎందుకంటే సెప్టెంబర్ 3న జరగాల్సిన ఆడియో రిలీజ్ ఫంక్షన్.. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది. ఎందుకో చూద్దాం పదండి.

సెప్టెంబర్ 3న 'జై లవ కుశ' ఆడియో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ రోజున హైదరాబాద్ గణేష్‌ నిమర్జనం ఉండటం వలన.. సెక్యురిటి ప్రాబ్లమ్ వస్తుందని తెలుసుకుని.. ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేశారట. దీని గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు చెబుతూ.. ''సెప్టెంబర్ 3న దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన జై లవ కుశ ఆడియోను డైరక్టుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం. గణేష్‌ నిమర్జనం కారణంగా ఆ రోజు ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసి.. సెప్టెంబర్ 10న గ్రాండ్ గా ప్రి-రిలీజ్ ఈవెంట్ చేస్తాం. అయితే ట్రైలర్ ను కూడా అదే రోజున విడుదల చేస్తాం'' అంటూ ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తానికి సెప్టెంబర్ మొదటివారంలో కావాలంటే ఆడియో వినొచ్చు కాని.. ట్రైలర్ చూడాలంటే మాత్రం సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.