Begin typing your search above and press return to search.

ఒకే లుక్‌ లో ముగ్గురు ఎన్‌ టీఆర్ లు

By:  Tupaki Desk   |   9 May 2017 9:41 AM GMT
ఒకే లుక్‌ లో ముగ్గురు ఎన్‌ టీఆర్ లు
X
ఎన్టీఆర్ కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత.. డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కొన్ని నెలలు ఎదురుచూసిన ఎన్టీఆర్.. చివరకు బాబీ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసేయడమే కాదు.. ఇప్పటికే లోగో లుక్ కూడా ఇచ్చేశాడు.

లోగో డిజైన్ విషయంలోనే బోలెడంత క్రియేటివిటీ చూపించిన దర్శకుడు బాబీ.. ఫస్ట్ లుక్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఒక రోజు ముందే.. అంటే మే 19నే జై లవ కుశ ఫస్ట్ లుక్ రివీల్ చేసేయనున్నాడట. ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ గిఫ్ట్ గా ఉండేలా ఈ ఫస్ట్ లుక్ ఉంటుందని అంటున్నారు. పైగా ఈ ఒక్క లుక్ లోనే మూడు పాత్రలకు సంబంధించిన డీటైల్స్.. లుక్స్ ఉండేలా ఈ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను లాక్ చేసేసుకున్న దర్శకుడు.. ప్రస్తుతం దీనితోనే ఓ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయిస్తున్నాడని తెలుస్తోంది.

మరో 3-4 రోజుల్లో ఇది కూడా సిద్ధమైపోతుందని టాక్ వినిపిస్తోంది. హ్యాపెనింగ్ బ్యూటీస్ రాశి ఖన్నా.. నివేద థామస్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ కాగా.. నికిత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించనున్న సంగీతం జై లవకుశకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.