Begin typing your search above and press return to search.
రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ డీల్
By: Tupaki Desk | 16 Aug 2017 5:25 AM GMTతెలుగు స్టార్ హీరో సినిమా అనగానే అందరూ ఇప్పుడు మాట్లాడుకునేది కథతో పాటు ఆ సినిమా కలెక్షన్లు కూడాను. మన దగ్గర ఎంత వచ్చింది ఓవర్సీస్ లో ఎంత కలెక్షన్ చేసింది అనేదాని పై కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో అనుకున్నంతగా ఆడకపోయాన ఇప్పుడు దసరాకు రాబోతున్న సినిమాలు మాత్రం బిజినెస్ బాగనే చేస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా ‘జై లవ కుశ’ సినిమా అయితే ఇప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ధరకే అమ్ముడుపోయింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు కానీ జై లవ కుశ సినిమా ఆఫీసు నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ మంచి ధరకే అడిగినట్లు చెబుతున్నారు.
అసలు ఈ సినిమా ఇంకా ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొనకపోవడానికి కారణం కూడా జై లవ కుశ ప్రొడ్యూసర్లు చెబుతున్నా ధరే. కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ హౌస్ వాళ్ళు 8.5 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ బట్టి ఆలోచిస్తే ఇది మంచి రేటే అని చెప్పాలి. ఇంతకముందు ఎన్టీఆర్ సినిమాలు కూడా మంచి బిజినెస్ చేసిన ఈ సినిమాకు పలికినంత ధర అయితే రాలేదు.ఇదే సమయంలో మహేశ్ బాబు సినిమా స్పైడర్ కూడా విడుదల అవ్వడంతో పోటీ గట్టిగానే ఉంది. ఇంతటి పోటీలో కూడా ఈ మొత్తానికి అడుగుతున్నారు అంటే ఈ కథలోని వైవిద్యమే కారణం అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎక్కువ మొత్తం పెట్టి కొనుకున్న ఓవర్సీస్ సినిమాగా రికార్డు నెలకొలిపింది జై లవ కుశ. కాని ఈ మొత్తం రికవర్ చేయాలంటే మాత్రం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి.
కే. యెస్.రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 నాడు విడుదలవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజులుకే మహేశ్ స్పైడర్ విడుదలకావడం ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ పై ఏమైనా ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు.