Begin typing your search above and press return to search.
పాటలు తగ్గించారా? తీసేశారా?
By: Tupaki Desk | 4 Sep 2017 1:23 PM GMTఒకప్పుడు ఆడియో క్యాసెట్ అంటే.. సైడ్-ఎ లో మూడు పాటలు.. సైడ్-బి లో మూడు పాటలు ఉండేవి. కాని ఇప్పుడు సీన్ మారింది. ఎందుకంటే మనోళ్ళు సినిమా లెంగ్త్ ను తగ్గించేశారు. అందుకోసం ఒక ఆరు నిమిషాల పాటను కూడా లేపేశారు. అయ్యో రామా.. అసలు పాటల లెంగ్త్ కూడా 6 నిమిషాలు నుండి నాలుగున్నర నిమిషాలకు వచ్చేసింది కదూ. ఇప్పుడు 'జై లవ కుశ' సినిమాలో ఇంకో ఫీట్ చూడండి మరి.
నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ అంటే.. ముగ్గురు హీరోలకూ మూడు పాటలు.. అలాగే మెయిన్ హీరోకు ఒక సాంగ్ ఎక్స్ ట్రా.. అలాగే ఒక ఐటెం సాంగ్.. ఇక ఒక శాడ్ సాంగ్ ఏదన్నా ఉంటుంది అనుకున్నారు జనాలు. కాని దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయి. ఒకటి విలన్ కోసం.. ఒకటి రాశి ఖన్నాతో.. ఒకటి నివేథా తామస్ తో.. మరోటి తమన్నాతో చేసే ఐటెం సాంగ్. ఒక ఆల్బమ్ లో ఐదు పాటలకు ఎడ్జస్ట్ అయిన లేటెస్ట్ జనరేషన్ ఇప్పుడు నాలుగు పాటలతో సరిపెట్టుకుంటుందిలే అనుకున్నారా ఏంటి? దీని గురించి రెండు విధాల టాక్ వినిపిస్తోంది.
అసలు ఈ సినిమాలో పాటలను ఎలా సెట్ చేయాలో తెలియలేదట. ఎన్టీఆరే మూడు పాత్రలు చేస్తున్నా కూడా.. అది మూడు హీరో పాత్రలతో సమానం. అందుకే ఈ మల్టీస్టారర్ లో పాటలు కట్ చేశారనేది ఒక టాక్. మరొక రూమర్ ఏంటంటే.. అసలు అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి.. ముందుగా అనుకున్నట్లు ఐదు లేదా ఆరు పాటలు అంటే టైమ్ సరిపోవట్లేదు. ఇప్పుడు అనవసరంగా ఆడియో ఆల్బమ్ లో ఆరు పాటలు పెట్టేసి.. అందులో రెండింటిని సినిమాలో పెట్టకపోతే.. అనవసరమైన నెగెటివ్ వైబ్స్ వస్తాయనే సినిమాలో రెండు పాటలు తీసేశారు అంటున్నారు కొందరు. ఏదేమైనా కూడా.. జై లవ కుశ లవ్వర్స్ మాత్రం నాలుగు పాటలతో సర్దుకోవాల్సిందే.