Begin typing your search above and press return to search.

తారక్ కెరీర్ లో 4వది.. తెలుగులో 33వది

By:  Tupaki Desk   |   24 Sept 2017 12:11 PM IST
తారక్ కెరీర్ లో 4వది.. తెలుగులో 33వది
X
ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జై లవకుశ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల ఎఫెక్టుతో బాగానే దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్ లో కూడా తారక్ ఇదివరకటి కంటే ఇప్పుడే ఎక్కువ వసూళ్ళను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా యుస్ ఏ లో ఈ సినిమా డాలర్లను బాగానే రాబడుతోంది.

ప్రీమియర్ షోల ద్వారా హాఫ్ మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్న జై లవకుశ ఇప్పుడు శనివరం నాటికి ఈజీగా 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఇప్పటివరకు 32 తెలుగు సినిమాలు ఈ ఘనతను సాధించగా ఇప్పుడు జై లవకుశ కూడా ఆ ఫీట్ ను అందుకుంది. ప్రస్తుతం సినిమ టాక్ ని బట్టి చూస్తే మొదటి వారం వరకు తారక్ 1.4 మిలియన్ డాలర్లు దాటవచ్చని అనలిస్ట్ లు భావిస్తున్నారు. ఇక ఇలానే కొనసాగితే పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ $ 2 మిలియన్ల క్లబ్ లో చేరతాడు అని తెలుస్తోంది. తారక్ ఈ స్థాయిలో దాలర్లని సాధించడానికి కారణం అతని గత చిత్రాల ప్రభావమనే చెప్పాలి. తారక్ గత సినిమాలు వైవిధ్యంగా ఉండడంతో తెలుగు ఎన్నారైలు చాలా ఇష్టపడుతున్నారు. ఆ ప్రభావమే ఎన్టీఆర్ నాలుగు చిత్రాలు 1 మిలియన్ దాలర్లలో చేరాయి.

జై లవకుశ బుధవారం నుండి శుక్రవారం వరకు సాధించిన డాలర్లు కలెక్షన్స్ మొత్తం - $ 998,470

బుధవారం ($ 589,390)

గురువారం ($ 144,894)

శుక్రవారం ($ 254,309)