Begin typing your search above and press return to search.
‘జై లవకుశ’కు ఇంకో 2 లక్షల డాలర్లు కావాలి
By: Tupaki Desk | 1 Oct 2017 6:00 AM GMTతెలుగు రాష్ట్రాల సంగేతమో కానీ.. అమెరికా వరకు ‘జై లవకుశ’ సేఫ్ అయిపోయేలాగే కనిపిస్తోంది. ఈ చిత్ర హక్కుల్ని యుఎస్ బయ్యర్ రూ.8.5 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే ఈ సినిమా అక్కడ 1.7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయాలి. అక్కడ గ్రాస్ వసూళ్లలోంచి ట్యాక్సులు.. పబ్లిసిటీ.. ఇతర ఖర్చులు.. మినహాయిస్తే మిగిలేది సగం కంంటే కొంచెం ఎక్కువ. అందుకే 1.7 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు పైనే) వసూలు చేస్తే తప్ప ‘జై లవకుశ’ బ్రేక్ ఈవెన్ కు రాదు. ఐతే ఈ చిత్రం ప్రిమియర్లతో కలిపి తొలి రోజే మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. కానీ ఆ తర్వాత వీక్ అయిపోయింది.
రెండో వీకెండ్లో ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది ‘జై లవకుశ’. శనివారం నాటికి ‘జై లవకుశ’ అక్కడ 1.483 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఇంకా 2 లక్షల డాలర్లు వసూలు చేస్తేనే బయ్యర్ సేఫ్ అన్నమాట. ఫుల్ రన్లో అటు ఇటుగా బ్రేక్ ఈవెన్ మార్కుకు ఈ చిత్రం చేరువగా వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ నష్టం వచ్చినా.. అది స్వల్పంగానే ఉంటుంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా తొలి వారంలో రూ.60 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఐతే ఈ చిత్రం రూ.85 కోట్ల షేర్ సాధిస్తేనే సేఫ్ అవుతుంది. కానీ అది అంత సులువు కాదు. తెలుగులో రాష్ట్రాల బయ్యర్లు ఎంతో కొంత నష్టపోక తప్పదేమో.