Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-రంజాన్.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   6 Jun 2017 10:27 AM GMT
ఎన్టీఆర్-రంజాన్.. ఏంటి కథ?
X
ప్రతి ఏడాదీ రంజాన్ వస్తోందంటే.. ఆ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రావాల్సిందే. మిగతా ఖాన్ హీరోలు కూడా ఆ రోజు సినిమాలు రిలీజ్ చేయడానికి లేదా.. ప్రేక్షకులకు తమ సినిమాలకు సంబంధించిన ఏదైనా విశేషాల్ని కానుకగా ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఐతే టాలీవుడ్ విషయానికి వస్తే రంజాన్ ను పెద్దగా పట్టించుకునే వాళ్లుండరు.

ఐతే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పోయినేడాది రంజాన్ పండక్కి ‘జనతా గ్యారేజ్’ టీజర్ లాంచ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం టోపీతో కనిపించడం కూడా తెలిసిన సంగతే. అదేదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకున్నారు కానీ.. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ రంజాన్ రోజు తన కొత్త సినిమా ‘జై లవకుశ’ టీజర్ లాంచ్ చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది కచ్చితంగా ముస్లింల్లో ఎన్టీఆర్ మీద ప్రత్యేక అభిమానం తీసుకొచ్చేదే. వరుసగా రెండో ఏడాది కూడా రంజాన్ రోజు ఎన్టీఆర్ సినిమా టీజర్ అనేసరికి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ముస్లింలలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తుల్లో ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్నుంచే ఓ వర్గంలో తనకు ఆదరణ పెంచుకునే ప్రయత్నాన్ని తన సినిమాల ద్వారా ప్రయత్నిస్తున్నాడేమో అంటూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి ప్రస్తుతం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/