Begin typing your search above and press return to search.

'జై' పాత్రకే హీరోయిన్.. వాటే ట్విస్ట్

By:  Tupaki Desk   |   7 Sep 2017 10:19 AM GMT
జై పాత్రకే హీరోయిన్.. వాటే ట్విస్ట్
X
ఇప్పుడు 'జై లవ కుశ' సినిమాలో మరోసారి తెలుగు తెరపై ఒక స్టార్ హీరో మూడు రోల్స్ లో కనిపిస్తున్నాడు. జూ.ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. అయితే ఈ పాత్రల్లో జై అనే ఒక పాత్రను రావణాసురుడిని పోలి ఉండే మనిషిగా మలిచారు. ఆల్రెడీ ఈ పాత్ర టీజర్ కూడా వచ్చింది. ఇక సినిమాలో రాశి ఖన్నా.. నివేథా థామస్.. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి.. వారిద్దరూ లవ అండ్ కుశ పాత్రకు ఉండే హీరోయిన్లు.. ఈ సినిమాలో జై కోసం హీరోయిన్ లేదనే అనుకున్నారు.

అయితే కోన వెంకట్ వారు రాసిన స్ర్కీన్ ప్లే మహిహతో.. ఈ సినిమాలో నెగెటివ్ పాత్రను చేస్తున్న జై పాత్రకే హీరోయిన్ ఉంది. రావణాసురుడి క్యారక్టర్ చేస్తున్న ఎన్టీఆర్ ను నివేథా థామస్ రొమాన్స్ చేస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఒక స్టిల్ చూస్తే ఆ విషయం క్లారిటీ అర్దమైపోయింది. అంతేకాకుండా ఆమె కూడా ఈ సినిమాతో చాలా సెక్సీగానే కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా స్టిల్స్ చూస్తుంటే.. లవ పాత్రకు రాశి ఖన్నా హీరోయిన్ అని మనం అర్దం చేసుకోవచ్చు. మరి కుశ పాత్ర పరిస్థితి ఏంటి?

ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలనే కుశ పాత్ర కోసం మిల్కీ బ్యూటి తమన్నాతో ప్రత్యేక గీతం ఒకటి ఒప్పించినట్లున్నారు. మొత్తానికి ఇలాంటి బ్యాలెన్సింగులను అదేదో ఇతర హీరోలతో కలసి మల్టీ స్టారర్ చేస్తున్న రేంజులో చేశారనమాట. చూద్దాం ఇవన్నీ ధియేటర్లలో ఎంతవరకు వర్కవుట్ అవుతాయో. సెప్టెంబర్ 21న జై లవ కుశ రిలీజవుతోంది.