Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ లుక్.. వరల్డ్ లెవెల్లో ట్రెండింగా?
By: Tupaki Desk | 20 May 2016 4:15 AM GMTవరుస ఫ్లాపుల వల్ల వెనకబడిపోయాడు కానీ.. ఈ తరం హీరోల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అగ్ర తాంబూలం ఇవ్వాలి. ఐతే హిట్లు కొడితే ఎన్టీఆర్ ఊపు ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. గత ఏడాది ‘టెంపర్’తో ఫామ్ లోకి వచ్చిన ఎన్టీఆర్.. ఈ ఏడాది ‘నాన్నకు ప్రేమతో’తో మరో మెమొరబుల్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతో కొత్తగా క్లాస్ ఆడియన్స్ ను కూడా తన అభిమానులుగా మార్చుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’తో అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేశాడు. ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నిన్నటి ట్విట్టర్ ట్రెండ్సే నిదర్శనం.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో నిన్న సాయంత్రం ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రెండు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు రిలీజ్ కావడానికి రెండు రోజుల ముందు నుంచే ‘జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్’ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ కన్సిస్టెంట్ గా హైదరాబాద్ లెవెల్లో టాప్ లో ట్రెండవుతూ వచ్చింది. ఇక పోస్టర్లు రిలీజవ్వడానికి కొన్ని గంటల ముందు ఇండియా లెవెల్లో ట్రెండయింది. పోస్టర్లు వచ్చేశాక ఇక రచ్చ మామూలుగా లేదు.
ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్థాయిలో ట్రెండ్ అవడమే కాదు.. వరల్డ్ లెవెల్లోనూ ట్రెండ్ అయి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇలా ప్రపంచ స్థాయిలో ట్రెండవడం చాలా అరుదు. దీన్ని బట్టే ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఏంటన్నది.. ‘జనతా గ్యారేజ్’ లుక్స్ జనాల్ని ఎంత ఆకర్షించాయన్నది అర్థం చేసుకోవచ్చు.