Begin typing your search above and press return to search.
గ్యారేజ్ బలాన్ని జూలై 22న వినండి
By: Tupaki Desk | 8 July 2016 8:21 AM GMT''జనతా గ్యారేజ్'' సినిమా కాన్సెప్టే.. బలహీనుడికి బలం చేకూర్చడానికి అండగా నించునే ఒక శక్తి.. మా గ్యారేజ్.. అంటూ మొదలెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పక్కనే అసలు అలా నుంచునే బలాలు ఏంటి అంటే.. అన్నింటికంటే ముందు సంగీతం అనే చెప్పుకోవాలి. హీరో స్టార్డమ్.. డైరక్టర్ రైటింగ్ పవర్.. ఇవన్నీ ధియేటర్లకు వచ్చాక తెలుస్తాయి కాని.. అసలు ధియేటర్లకు రప్పించే బలాతిబలమైన శక్తి ఈ మ్యూజిక్కే మరి.
దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు ఎన్టీఆర్ కోసం ఎన్నిసార్లు మ్యూజిక్ అందించినా కూడా.. చితక్కొట్టేశాడు. అప్పుడెప్పుడో వచ్చిన ''నా అల్లుడు'' సినిమా పాటలైనా.. మొన్ననే మనం విన్న ''నాన్నకుప్రేమతో'' పాటలైనా కూడా.. సూపర్ హిట్టే. ఇక జనతా గ్యారేజ్ టీజర్లో మనం విన్న బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తే.. మరోసారి యంగ్ టైగర్ కోసం దేవి చింపేస్తాడని అర్దమైపోతోంది. ఇకపోతే ఈ సంగీత బలాన్ని ప్రదర్శించడానికి జూలై 22న మన ముందుకు రానున్నారు గ్యారేజీ వారు. హైదరాబాద్ లోనే యథావిథిగా పాటల పండుగను నిర్వహిస్తారట.
జూ.ఎన్టీఆర్ మెయిన్ లీడ్ గా.. సమంత అండ్ నిత్యా మీనన్ హీరోయిన్లుగా.. మోహన్ లాల్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటిస్తున్న ''జనతా గ్యారేజ్'' సినిమాను.. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 12నే విడుదల చేస్తాం అంటున్నారు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్.