Begin typing your search above and press return to search.
4వ రోజుకే 50 కోట్ల మెంబర్ గా గ్యారేజ్
By: Tupaki Desk | 5 Sep 2016 10:17 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ రోజున రివ్యూలు ప్రోత్సాహకరంగా లేకపోయినా.. డివైడ్ మౌత్ టాక్ వచ్చినా.. అవేవీ గ్యారేజ్ సెన్సేషన్స్ కి బ్రేక్ వేయలేకపోయాయి. ఆఖరికి భారత్ బంద్ కూడా ఎన్టీఆర్ సినిమాను కొంచెం కూడా కదల్చలేకపోయింది.
జనతా గ్యారేజ్ నాలుగో రోజుకే 50 కోట్ల షేర్ సాధించిన క్లబ్ లోకి ఎంటర్ అయిపోవడం విశేషం. బాహుబలి తర్వాత అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన మూవీగా జనతా గ్యారేజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బంద్ ఎఫెక్ట్ తో రెండో రోజు కలెక్షన్స్ తగ్గినా.. ఆదివారం నాటికి గ్యారేజ్ విపరీతంగా పుంజుకుంది. దీంతో ఏపీ తెలంగాణల నుంచే 35.85 కోట్లు కలెక్షన్స్ రాగా.. కర్నాటక - చెన్నై - రెస్టాఫ్ ఇండియాల నుంచి దాదాపు 8 కోట్లు వచ్చాయి. యూఎస్ లో అయితే.. మొదటి వీకెండ్ ముగిసే నాటికే 1.4మిలియన్ డాలర్లు సాధించగా.. ఇందులో షేర్ 5 కోట్లకు పైగా ఉండనుంది.
గతంలో ఎన్టీఆర్ కు 50 కోట్ల క్లబ్ అంటే గగనం అనిపించేది. నాన్నకు ప్రేమతో ఫుల్ రన్ లో ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు 4 రోజుల్లో ఆ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. గ్యారేజ్ షుమారు 50.5 కోట్లు షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తో తన రియల్ స్టామినా ఏంటో ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడని చెప్పచ్చు. ఇప్పుడున్న స్పీడ్ చూస్తే.. ఈ చిత్రం 70 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవడం అంత కష్టమేం కాకపోవచ్చని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. సోమవారం నాడు వినాయక చవితి హాలిడే ఉండడం.. నెక్ట్స్ వీకెండ్ లో భారీ చిత్రాలేమీ రిలీజ్ కి షెడ్యూల్ చేసి లేకపోవడంతో.. వచ్చే వారాంతం వరకూ ఎన్టీఆర్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.