Begin typing your search above and press return to search.

అలా చూస్తే ఎన్టీఆర్ టార్గెట్ చిన్నదే

By:  Tupaki Desk   |   16 Aug 2016 12:37 PM GMT
అలా చూస్తే ఎన్టీఆర్ టార్గెట్ చిన్నదే
X
ఇక త్వరలో మనల్ని ఎంటర్టయిన్ చేయడానికి వస్తోంది ''జనతా గ్యారేజ్‌''. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలేవీ పెద్దగా అలరించని దృష్ట్యా.. ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమాపైనే హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. అలాగే పంపిణీదారులు కూడా ఈ సినిమా అధిక లాభాలను కురిపిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

అమెరికా మరియు ఇతర ఇంటర్నేషనల్ హక్కుల సంగతి చూస్తే.. నిజానికి జనతా గ్యారేజ్ సినిమా మరీ ఓవర్ రేట్లకు అమ్మలేదట. కేవలం 7.5 కోట్లకు అమెరికా - కెనడా - మరియు ఇతర ఓవర్సీస్ హక్కులన్నీ అమ్మేశారట. ఆ లెక్కన సినిమా 1.7 మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే చాలు.. పంపిణీదారులు సేఫ్‌ జోన్ లోకి వచ్చేసినట్లే. ఇప్పటికే ట్రైలర్ రిలీజయ్యాక ఒక పాజిటివ్ వైబ్ రావడం.. అలాగే శ్రీమంతుడు షేడ్స్ తో ఉండటంతో ఇది కూడా మరో సోషల్ మెసేజ్ సినిమా ఏమో అంటూ ఎన్నారై ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూడటం.. జూనియర్ కు ప్లస్సయ్యే అంశాలు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా సినిమా ఈజీగా 1 మిలియన్ డాలర్లు అయితే మొదటి వారంలోనే వసూలు చేస్తుంది. ఇక మరో 0.7 మిలియన్ వసూలు చేయడం పెద్ద కష్టమేమీ అవ్వదనే అంటున్నారు ట్రేడ్ పండితులు.

చూస్తుంటే జనతా గ్యారేజ్ విషయంలో నిర్మాతలు కూడా మొదట్లో కాస్త ఎక్కువ రేట్లు చెబుతున్నారనే టాక్ వచ్చినా.. ఇప్పుడు మాత్రం నామినల్ ప్రైస్ కే సినిమాను విక్రయిస్తున్నారట. దాని వలన ఎవ్వరికీ నష్టం వచ్చే పరిస్థితి తెలత్తదు.